HDPP COMMITTEE MEETING HELD_ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌

Tirupati, 18 Feb. 19: The executive committee meeting of Hindu Dharma Prachara Parishad was held under the chairmanship of TTD board chief Sri P Sudhakar Yadav on Monday in SPRH in Tirupati.

Important decisions:

@ To provide TTD publications to the library located in State Assembly at Amaravathi

@ To prepare an action plan to train students belonging to high schools of different districts in the state in Annamacharya Sankeertans

@ To enhance remuneration to the artistes of Hari katha and sakeertans

TTD Board Member Sri Dokka Jagannadham, Tirupati JEO Sri Sri B Lakshmikantham, HDPP Secretary Dr Ramana Prasad, HDPP committee members Sri RV Venkatanarayana Subbarama Sharma, Sri RV Ravichandra Sarma, Sri Ch. Seetharamanajeya Prasad, Annamacharya Project Director Acharya B Viswanatham, Sales wing DyEO Sri Hemachandra Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌

ఫిబ్ర‌వ‌రి 18, తిరుప‌తి, 2019: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గ‌ల హైస్కూల్ విద్యార్థిని విద్యార్థుల‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ తెలిపారు. తిరుపతిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతిగృహంలో సోమ‌వారం హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌మావేశం జ‌రిగింది.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్ మాట్లాడుతూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో గ‌ల అసెంబ్లీ భ‌వ‌నం గ్రంథాల‌యానికి ఆధ్యాత్మిక‌, నైతిక‌, ఇత‌ర ప్ర‌చుర‌ణ‌ల‌ను అందించ‌నున్న‌ట్టు తెలిపారు. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా హ‌రిక‌థ‌, సంగీత కార్య‌క్ర‌మాల్లో పాల్గొనే క‌ళాకారుల‌కు పారితోషికం పెంచ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అదేవిధంగా హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న వివిధ కార్య‌క్ర‌మాల‌ను ఛైర్మ‌న్ స‌మీక్షించారు.

ఈ స‌మావేశంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ డొక్కా జ‌గ‌న్నాథం, తిరుప‌తి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి శ్రీ ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌భ్యులు శ్రీ ఆర్‌వి.వెంక‌ట‌నారాయ‌ణ సుబ్బ‌రామ శ‌ర్మ‌, శ్రీ ఆర్‌వి.ర‌విచంద్ర‌శ‌ర్మ‌, శ్రీ సిహెచ్‌.సీతారామాంజ‌నేయ‌ప్ర‌సాద్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య బి.విశ్వ‌నాథం, ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి డా.. ఆంజ‌నేయులు, సేల్స్ వింగ్ డెప్యూటీ ఈవో శ్రీ హేమచంద్రారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.