HIGHLIGHTS OF SRIVARI BRAHMOTSAVAM- 2022 _ స‌మిష్టి కృషితో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌యవంతం

PRIORITY WAS GIVEN TO ONLY COMMON PILGRIMS LIKE NEVER BEFORE 

TIRUMALA, 05 OCTOBER 2022: Thanking the pilgrim devotees, TTD workforce, Srivari Sevaks, police and press for their fine co-operation towards the grand and successful conduct of Srivari annual Brahmotsavam, TTD Chairman Sri YV Subba Reddy said, for the first time cent percent priority given only to common pilgrims.

Speaking to media persons in Annamaiah Bhavan in Tirumala on Wednesday along with TTD EO Sri AV Dharma Reddy, he said TTD has grandly celebrated the annual fete from September 27 to October 5. He said TTD has cancelled all privilege, VIP Break, SRIVANI, Rs. 300 darshan tickets and given priority to only common pilgrims.

 

The Honourable CM of AP Sri YS Jaganmohan Reddy launched the environment-friendly electric buses from Tirupati to Tirumala on September 27.

He also presented pattu vastrams to Swami varu and also participated in  Pedda Sesha vahana Seva on the same day.

Later on September 28, he inaugurated the newly built Parakamani Bhavan and VPR guest house in Tirumala.

Elaborating the highlights for eight days he has given the statistics of each department 

SRIVARI TEMPLE:

56.69 lakh devotees had Srivari Darshanam and on Garuda Seva day alone 81,318 persons had Darshan while over 3 lakh devotees had participated in Garuda Vahana Seva. The innovative idea of operating special queues in three corners has facilitated Garuda Seva to more devotees which was appreciated by many.

TTD sold a total of 24.89 lakh laddus and the Hundi collections stood at ₹20.43 crore.

VIGILANCE AND SECURITY: 

TTD deployed 2279 CC cameras and 4635 vigilance and police for bandobust to provide Safety and Security to pilgrims.

TTD also distributed 1.20 lakh Geo tags to protect children from getting lost.

KALYANA KATTA:

A total of 2.20 lakh devotees offered tonsuring and 1189 barbers worked round the clock in nine kalyankattas.

RECEPTION:

TTD recorded occupancy of  74.25 % rooms during Brahmotsavams.

ANNAPRASADAM: 

20. 99 lakh meals and breakfast were served during 8 days of Brahmotsavam.

On Garuda Seva day alone 7.87 lakh devotees were served 3.46 lakh were given coffee and tea, apart from 2 lakh buttermilk packets and drinking water.

MEDICARE: 

45 doctors, 60 paramedics and 12 ambulance were deployed.

41,000 devotees provided free Medicare.

HEALTH: 

1360 sanity workers for keeping Tirumala clean and shining .800 more during Garuda Seva day

ENGINEERING: 

Mada street galleries were prepared  to accommodate nearly 2 lakh devotees.

Parking for 9 lakh vehicles were facilitated.

334 lakh gallons of water were utilized.

Parking facility created for two-wheelers and cars  at Alipiri and Srivari Mettu

20 electric cutouts of deities and eight LED screens installed.

HDPP :

As part of cultural shows 91 teams comprising of 1906 artists performed at Tirumala, Vahana sevas and Tirupati.

As a part of Brahmotsava Darshanam to people from backward places, 6997 devotees belonging to all 26 districts of AP were brought in 140 buses to Tirumala and provided Srivari Darshan.

GARDEN DEPARTMENT: 

Flower decorations at Srivari temple, junctions, rest houses – 35 tons of flowers, 3 lakh cut flowers,60,000 seasonal flowers

For the first time saffron strings from Kashmir are used to make garlands and crown during Snapana Tirumanjanam.

PR DEPARTMENT:

Media Centre at Rambagicha -2 and photo exhibition at Kalyana Vedika were arranged.

Service by 3750 Srivari Sevakulu from across country have been utilized.

PUBLICATIONS: 

₹31 lakh worth TTD publications sold and 10 books were released during Vahana sevas.

SVBC : 

 * About 57 hours of live telecast of all programs in Telugu, Tamil, Kannada and Hindi channels related to Brahmotsavams in SVBC channel 

Commentary by eminent pundits in Telugu, Hindi, Kannada and Tamil organized.

APSRTC 

12638 trips from Tirupati to Tirumala carried 3.47 lakh devotees while in 12835 4.47 lakh devotees were transported to Tirupati.

Board member Sri Madhusudhan Yadav, LAC New Delhi Chief Smt Vemireddi Prasanti Reddy, LAC Chennai Chief Sri Sekhar Reddy, JEO(H & E) Smt Sada Bhargavi, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, all senior officers were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స‌మిష్టి కృషితో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌యవంతం

– అధికారులు, సిబ్బంది, పోలీసులు, శ్రీ‌వారి సేవ‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు

– స‌ర్వ‌ద‌ర్శ‌నంతో భ‌క్తుల సంతృప్తి

– క‌ళాప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల భ‌క్తుల ఆనందం

– టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, 2022 అక్టోబరు 05: టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీ‌వారి సేవ‌కుల‌ స‌మిష్టి కృషి, భక్తుల సహకారంతోనే శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు విజ‌య‌వంతం అయ్యాయ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఛైర్మ‌న్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి గౌ. శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేర‌కు సామాన్య భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా బ్ర‌హ్మోత్స‌వాల్లో ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని తెలిపారు. వాహ‌న‌బేర‌ర్లు ఎంతో భ‌క్తిభావంతో వాహ‌నాల‌ను మోశార‌ని అభినందించారు. టిటిడి ఈవో, జెఈవోలు, సివిఎస్‌వోతోపాటు ఉన్న‌తాధికారులు విశేష సేవ‌లందించార‌ని కొనియాడారు. బ్ర‌హ్మోత్సవ వైభ‌వాన్ని వ్యాప్తి చేసిన మీడియా ప్ర‌తినిధుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 4వ తేదీ వ‌ర‌కు(8 రోజులు) న‌మోదైన వివ‌రాలను ఛైర్మ‌న్ తెలియ‌జేశారు.

– ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సెప్టెంబ‌రు 27వ తేదీ తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు విద్యుత్ బ‌స్సులు ప్రారంభించారు. స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించి పెద్దశేష వాహ‌న సేవ‌లో పాల్గొన్నారు.

-సెప్టెంబ‌రు 28వ తేదీ నూత‌నంగా నిర్మించిన ప‌ర‌కామ‌ణి భ‌వ‌నం, విపిఆర్ గెస్ట్ హౌస్‌ ప్రారంభించారు.

శ్రీవారి ఆలయం :

– 5.69 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంత పెద్ద సంఖ్య‌లో మొద‌టిసారిగా సామాన్య భ‌క్తులు సంతృప్తిగా స‌ర్వ‌ద‌ర్శ‌నం చేసుకోవ‌డం గొప్ప విష‌యం.

– గరుడసేవనాడు 81,318 మంది దర్శించుకున్నారు. కాగా, గరుడసేవ‌లో 3 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు.

– 9 లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌.

– విక్రయించిన మొత్తం లడ్డూలు 24.89 లక్షలు.

– హుండీ ఆదాయం రూ.20.43 కోట్లు.

నిఘా మరియు భద్రతా విభాగం :

– 2279 సిసిటివిలు, 4635 మంది టిటిడి విజిలెన్స్‌, పోలీసులు బందోబ‌స్తు నిర్వ‌హించారు.

– చిన్నపిల్లలు తప్పిపోకుండా 1.20 లక్షల జియోట్యాగ్‌లు.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 2.20 లక్షలు.

– 1,189 మంది క్షురకులు 9 కల్యాణకట్టల్లో భక్తులకు తలనీలాలు తీయడం జరిగింది.

రిసెప్ష‌న్‌ :

– బ్రహ్మోత్సవాలలో గ‌దుల ఆక్యుపెన్సీ – 74.25 శాతం

అన్నప్రసాదం :

– బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 20.99 లక్షల భోజనాలు, అల్పాహారం అందించడమైనది.

– గరుడసేవనాడు 7.87 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 3.47 లక్షల మందికి టి, కాఫి, పాలు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు అందించడం జరిగింది.

వైద్యం :

– 45 మంది డాక్టర్లు, 60 మంది పారామెడికల్‌ సిబ్బందిని, 12 అంబులెన్సులు వినియోగించడమైనది.

– 41 వేల మందికి పైగా భక్తులకు వైద్యసేవలు.

ఆరోగ్య విభాగం :

– తిరుమ‌ల‌లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం 1360 మంది సిబ్బందిని, గ‌రుడ సేవ రోజు అద‌నంగా 800 మంది సిబ్బంది ఏర్పాటు.

ఇంజనీరింగ్‌ విభాగం :

– దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చొని వాహనసేవలు వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలు ఏర్పాటు.

– తిరుమ‌ల‌లో 9 వేల వాహ‌నాల‌కు స‌రిప‌డా పార్కింగ్, చక్రస్నానం కోసం పుష్కరిణిలో ప్రత్యేక క్యూలైన్లు.

– బ్రహ్మోత్సవాల్లో 334 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం.

– శ్రీవారిమెట్టు, అలిపిరి వద్ద కార్లు, ద్విచక్రవాహనాలకు పార్కింగ్‌ వసతి.

– తిరుమ‌ల‌లో 20 దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు, 8 ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు.

టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టులు :

– హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏడు రాష్ట్రాల నుండి వ‌చ్చిన 91 కళాబృందాల్లో 1906 మంది కళాకారులు వాహ‌న సేవ‌ల‌తో పాటు తిరుమ‌ల‌, తిరుప‌తిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయి. భ‌క్తులు ఎంతో సంతోషించారు.

– రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి 147 బ‌స్సుల ద్వారా 6,997 మంది వెనుక‌బ‌డిన పేద వ‌ర్గాలవారిని ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకొచ్చి శ్రీ‌వారి మూల‌మూర్తి ద‌ర్శ‌నంతో పాటు వాహ‌న‌సేవ‌ల ద‌ర్శ‌నం చేయించడం జ‌రిగింది.

ఉద్యానవన విభాగం :

– శ్రీవారి ఆలయంతో పాటు ప‌లు కూడ‌ళ్ళు, అతిథి గృహాల వ‌ద్ద శోభాయమానంగా పుష్పాల అలంకరణలు, పుష్పప్రదర్శన. 35 టన్నులు పుష్పాలు, 3 లక్షల కట్‌ ఫ్లవర్స్‌, 60 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగం.

– స్న‌ప‌న‌తిరుమంజ‌నంలో తొలిసారి కాశ్మీర్ కుంకుమ‌పువ్వు మాల‌లు, కిరీటాల‌ను అలంక‌రించారు.

ప్రజాసంబంధాల విభాగం :

– రాంభగీచా-2లో మీడియా సెంటర్, ఫోటో ఎగ్జిబిష‌న్‌ ఏర్పాటు.

– దేశం నలుమూలల నుండి విచ్చేసిన 3750 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు.

ప్ర‌చుర‌ణ‌ల విభాగం :

– తిరుపతి, తిరుమలలో పుస్తక విక్రయశాలలు ఏర్పాటు. ప్రచురణల విక్రయం : రూ.31 లక్షలు. వాహ‌న‌సేవ‌ల్లో తెలుగు, సంస్కృత భాష‌ల్లో 10 గ్రంథాల ఆవిష్క‌ర‌ణ‌.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ :

– ఎస్వీబీసీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఛానళ్లలో రోజుకు 8 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారాలు. యుట్యూబ్‌, ఎస్వీబీసీ యాప్‌, టిటిడి వెబ్‌సైట్‌ ద్వారా కూడా భక్తులకు అందించాం.

– ప్రముఖ పండితులతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వ్యాఖ్యానాలు.

ఎపిఎస్‌ఆర్‌టిసి :

– ఎపిఎస్‌ఆర్‌టిసి తిరుపతి నుంచి తిరుమలకు 12,638 ట్రిప్పుల్లో 3.47 లక్షల మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 12,835 ట్రిప్పుల్లో 4.47 లక్షల మంది భక్తులను చేరవేశాయి.

– గరుడసేవనాడు ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 2345 ట్రిప్పుల్లో 1,01,880 మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 2386 ట్రిప్పుల్లో 72,637 మంది భక్తులను చేరవేశాయి.

మీడియా స‌మావేశంలో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, చెన్నై స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సిఈవో శ్రీ ష‌ణ్ముఖ్ కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.