HISTORICAL SAMPOORNA SUNDARAKANDA PATHANAM FETE HELD BY TTD _ లోక సంక్షేమం కోసం అఖండ సుంద‌ర‌కాండ పారాయ‌ణం 68 స‌ర్గల్లో 2,821 శ్లోకాలు

Tirumala, 31 May 2021: For the first time in the history of TTD, a 16-hour long non-stop Sampoor Akhanda Sundarakanda Pathanam was conducted at the Dharmagiri Veda Vijnana Peetham on Monday.

Nearly 40 Veda Pundits in four groups performed Pathanam of 2821 shlokas from all 68 sargas of Sundarakanda for 16 hours without interruption from 6 am to 10 pm.

Sri Venugopal Dikshitulu, Chief Archaka of Srivari temple said Parayanams including Sundarakanda Pathanam, Bhagavadgita, Virat Parva, Dhanvanthri Maha Yagam and other dharmic and vaidika programs are being organised by the TTD throughout the year for benefit of humanity.

Speaking to media later, the Principal of Dharmagiri Veda Vijnana Peetham Sri KSS Avadhani said the Sundarakanda Pathanam was taken up on the Sravana Nakshatram, the birth star of Sri Venkateswara with the objective of protecting the humanity from the pandemic Corona.

After chanting each shloka the pundits performed the rituals of Homa Dravya Samarpana and the entire event was live telecasted on SVBC channel for benefit of devotees to follow from their homes and beget blessings of Sri Venkateswara.

Addl EO Sri AV Dharma Reddy, SVBC CEO Sri Suresh Kumar, Srivari temple DyEOs Sri Harindranath, Sri Vijaya Saradhi, Sri Loganatham, VGO Sri Bali Reddy, Catering Officer Sri GLN Shastri and other staffs were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

లోక సంక్షేమం కోసం అఖండ సుంద‌ర‌కాండ పారాయ‌ణం

68 స‌ర్గల్లో 2,821 శ్లోకాలు

40 మంది పండితులు 16 గంట‌ల పాటు పారాయ‌ణం

మే 31, తిరుమ‌ల‌, 2021: క‌రోనా వ్యాధి నిర్మూలన కోసం శ్రీ వేంకటేశ్వ‌ర‌స్వామివారిని ప్రార్థిస్తూ, లోక సంక్షేమం కోసం టిటిడి అఖండ సుంద‌ర‌కాండ పారాయ‌ణం చేప‌ట్టింది. తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి ఎస్వీ వేద విజ్ఞాన పీఠంలో గ‌ల ప్రార్థ‌నా మందిరంలో సోమ‌వారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో సుంద‌ర‌కాండ‌లోని 68 స‌ర్గల్లో గ‌ల 2,821 శ్లోకాలను 40 మంది పండితులు నాలుగు బృందాలుగా 16 గంట‌ల పాటు నిరంత‌రాయంగా పారాయ‌ణం చేశారు. ఉద‌యం 6 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మం రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా హోమం ఏర్పాటు చేసి ప్ర‌తి శ్లోకం త‌రువాత హోమ‌ద్ర‌వ్యాన్ని స‌మ‌ర్పించారు. ఈ మొత్తం కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌మ ఇంటి నుండి టీవీల ద్వారా పారాయ‌ణంలో పాల్గొన్నారు.

పారాయ‌ణ కార్య‌క్ర‌మం ఇలా జ‌రిగింది. ఉద‌యం 6 నుండి 6.40 గంట‌ల వ‌ర‌కు 100 శ్లోకాల‌తో సంక్షేప రామాయ‌ణం పారాయ‌ణం చేశారు. 6.40 నుండి 7.40 గంట‌ల వ‌ర‌కు ఒక‌టో స‌ర్గ‌లోని 211 శ్లోకాలు, ఉద‌యం 7.40 నుండి 8.50 గంట‌ల వ‌ర‌కు 2 నుండి 8వ స‌ర్గ వ‌ర‌కు 235 శ్లోకాలు, ఉద‌యం 8.50 నుండి 10.10 గంట‌ల వ‌ర‌కు 9 నుండి 13వ స‌ర్గ వ‌ర‌కు 269 శ్లోకాలు, ఉద‌యం 10.10 నుండి 11.25 గంట‌ల వ‌ర‌కు 14 నుండి 20వ స‌ర్గ వ‌ర‌కు 262 శ్లోకాలు, మ‌ధ్యాహ్నం 11.25 నుండి 12.50 గంట‌ల వ‌ర‌కు 21 నుండి 28వ స‌ర్గ వ‌ర‌కు 291 శ్లోకాలు పారాయ‌ణం చేశారు.

మ‌ధ్యాహ్నం 12.50 నుండి 2 గంట‌ల వ‌ర‌కు 29 నుండి 35వ స‌ర్గ వ‌ర‌కు 247 శ్లోకాలు, మ‌ధ్యాహ్నం 2 నుండి 3.25 గంట‌ల వ‌ర‌కు 36 నుండి 41వ స‌ర్గ వ‌ర‌కు 286 శ్లోకాలు, మ‌ధ్యాహ్నం 3.25 నుండి సాయంత్రం 4.50 గంట‌ల వ‌ర‌కు 42 నుండి 50వ స‌ర్గ వ‌ర‌కు 283 శ్లోకాలు, సాయంత్రం 4.50 నుండి 6.15 గంట‌ల వ‌ర‌కు 51 నుండి 57వ సర్గ వ‌ర‌కు 287 శ్లోకాలు, సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.35 గంట‌ల వ‌ర‌కు 58 నుండి 62వ స‌ర్గ వ‌ర‌కు 273 శ్లోకాలు, రాత్రి 7.35 నుండి 9.15 గంట‌ల వ‌ర‌కు 63 నుండి 68వ సర్గ వ‌ర‌కు 177 శ్లోకాలు పారాయ‌ణం జ‌రుగ‌నుంది.

టిటిడి చ‌రిత్ర‌లో తొలిసారిగా అఖండ పారాయ‌ణం

ఈ సంద‌ర్భంగా ఎస్వీ వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని మీడియాతో మాట్లాడుతూ ప్ర‌పంచ మాన‌వాళి యోగ‌క్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీ‌వారు జన్మించిన శ్ర‌వ‌ణా న‌క్ష‌త్రం రోజున సుంద‌ర‌కాండ‌లోని అన్ని శ్లోకాలు పారాయ‌ణం చేస్తున్న‌ట్టు తెలిపారు. టిటిడి చ‌రిత్ర‌లో తొలిసారిగా 16 గంట‌ల పాటు అఖండంగా పారాయ‌ణం చేయ‌డం విశేష‌మ‌న్నారు. వేదాల సారం గాయ‌త్రీ మంత్రంలో ఉంద‌ని, ఇందులోని సారంతో శ్రీ వాల్మీకి మ‌హ‌ర్షి రామాయ‌ణాన్ని ర‌చించార‌ని చెప్పారు. రామాయ‌ణంలో అతి ముఖ్య‌మైన కాండ సుంద‌ర‌కాండ అని, ఇందులోని శ్లోకాల‌న్నీ ఎంతో సుంద‌ర‌మైన‌వ‌ని అన్నారు. ఈ శ్లోక పారాయ‌ణం ద్వారా మాన‌వాళి ఆయురారోగ్యాలు పొందాల‌నే దృఢ‌మైన సంక‌ల్పంతో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. ” రాఘ‌వో విజ‌‌యం ద‌ద్యాన్మ‌మ సీతా ప‌తిః ప్ర‌భుః, రాఘవస్య పద ద్వంద్వం దద్యాదమిత వైభవమ్ “, “నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ” మొద‌టి శ్లోకం ద్వారా శ్రీ‌రామ‌చంద్రుని, రెండో శ్లోకం ద్వారా ఆంజ‌నేయుని భ‌క్తులు ప్రార్థించిన‌ట్ట‌యితే స‌క‌ల‌శుభాలు క‌లుగుతాయ‌న్నారు.

శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ క‌రోనా మ‌హ‌మ్మారిని మానవాళికి దూరం చేయాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ సంవ‌త్స‌రం రోజులుగా టిటిడి అనేక ధార్మిక‌, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంద‌ని చెప్పారు. ఇందులో భాగంగా సుంద‌ర‌కాండ‌, భ‌గ‌వ‌ద్గీత‌, విరాటప‌ర్వం, ధ‌న్వంత‌రీ మ‌హాయాగం త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం వ‌ల్ల శ‌బ్ద త‌రంగాలు వాతావ‌ర‌ణంలో క‌లిసి మాన‌వాళికి ఆరోగ్యాన్ని ప్ర‌సాదిస్తాయ‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్‌కుమార్‌, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్, డెప్యూటీ ఈఓలు శ్రీ విజయ‌సార‌థి, శ్రీ లోక‌నాథం, విజివో శ్రీ బాలిరెడ్డి, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్ర్తి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.