HM OFFERS PRAYERS IN SRI KT _ శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకున్న భారత హోం మంత్రి గౌ. శ్రీ అమిత్ షా

TIRUPATI, 15 NOVEMBER 2021: The Union Home Minister Sri Amit Shah offered prayers in the ancient Temple of Sri Kapileswara Swamy at Tirupati on Monday.

 

 

Earlier on his arrival, he was received by TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawhar Reddy and given traditional welcome with Purnakumbham amidst chanting of Veda Mantras.

 

 

Later he offered prayers to Sri Vinayaka Swamy then to Dhwajasthambham. Afterwards, he took part in Abhisheka Seva of the main deity. He also had darshan of Sri Kamakshi Ammavaru, Sri Guru Dakshinamurthy, Sri Subramanya Swamy.

 

 

The Central Home Minister also participated in Chandi Homam as part of the ongoing Homa Mahotsavams.

 

 

Later on the Chairman and EO offered him Prasadams and presented him “Roots” book along with a portrait of the deity.
 
 

MPs Sri Sujana Chowdary, Sri CM Ramesh, board member Sri Krishnamurty Vaidyanathan, former minister Lakshmi Narayana, former TTD Board Member Sri Bhanuprakash Reddy, Collector Sri Harinarayana, JEO Sri Veerabrahmaiah, Tirupati Urban SP Sri Venkatappala Naidu, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Subramanyam and other officers were also present.

 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకున్న భారత హోం మంత్రి గౌ. శ్రీ అమిత్ షా

తిరుపతి, 2021 న‌వంబ‌రు 15: భారత హోం మంత్రి గౌ. శ్రీ అమిత్ షా సోమ‌వారం మ‌ధ్యాహ్నం తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న శ్రీ అమిత్ షాకు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అర్చ‌కులు పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు.

శ్రీ అమిత్ షా ముందుగా శ్రీ వినాయ‌క‌స్వామివారిని ద‌ర్శించుకుని ధ్వ‌జ‌స్తంభానికి న‌మ‌స్క‌రించారు. శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి అభిషేక సేవ‌లో పాల్గొన్నారు. అనంత‌రం శ్రీ కామాక్షి అమ్మ‌వారిని, శ్రీ గురు ద‌క్షిణామూర్తి స్వామివారిని, శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఆ త‌రువాత చండీ హోమంలో పాల్గొన్నారు. టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో క‌లిసి స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు, టిటిడి ముద్రించిన రూట్స్ అనే పుస్త‌కం, శ్రీ‌వారి ప్ర‌తిమ అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎంపిలు శ్రీ సిఎం.ర‌మేష్‌, శ్రీ సుజ‌నా చౌద‌రి, బోర్డు స‌భ్యులు శ్రీ కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్‌, మాజీ మంత్రి శ్రీ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, బోర్డు మాజీ స‌భ్యుడు శ్రీ భానుప్ర‌కాష్‌రెడ్డి, క‌లెక్ట‌ర్ శ్రీ హ‌రినారాయ‌ణ‌న్‌, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మయ్య‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అర్బ‌న్ ఎస్పీ శ్రీ వెంక‌ట అప్ప‌ల‌నాయుడు, టీటీడీ అదనపు సివిఎస్వో శ్రీ శివ కుమార్ రెడ్డి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, డెప్యూటీ ఈవోలు శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, శ్రీ రమణ ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.