HUGE RESPONSE FROM VISITING DOCTORS TO BIRRD TO OFFER FREE SERVICES _ బ‌ర్డ్ ఆసుప‌త్రిలో స్వ‌చ్ఛంద విజిటింగ్ క‌న్స‌ల్టెంట్ల ఆహ్వానానికి అనూహ్య స్పంద‌న

SO FAR 90 APPLICATIONS RECEIVED FROM ORTHO SPECIALISTS

TTD TO PROVIDE FREE DARSHAN, ACCOMMODATION AND TRANSPORT TO THE VISITING CONSULTANTS

 TIRUPATI, 23 JULY 2021: The call given by TTD-run BIRRD hospital inviting ortho doctors as visiting consultants to offer free ortho services to the needy patients in BIRRD has been receiving overwhelming response from Ortho experts from across the country.

 

So far about 90 Ortho specialists have sent their applications expressing their willingness to offer free services to the patients at BIRRD. After thoroughly verifying these applications, the BIRRD authorities have selected a few specialists.          

According to Special Officer of BIRRD Dr R Reddeppa Reddy, already 16 Ortho experts have been rendering their services to patients. He said among these doctors, some consultants will visit monthly once, while a few monthly twice and offer free services to patients including surgeries. He said, Dr K Krishnaiah from KIMS Hyderabad, Dr Krishna Kiran from Chief Consultant Medi Cover Hospital, New Delhi, Dr Hemath, Orthoscopy Bengaluru have also done critical surgeries apart from attending OP services. The BIRRD Special Officer said among the selected Ortho Specialists who sent their applications includes, Dr Sunil Ansangi from Chandigarh, Dr IV Reddy, Dr Balavardhan Reddy, Dr Sai Lakshman Anne, Senior Consultant Doctors including Dr Chandrasekhar, Dr Vikas Reddy, Dr Vinay Kishore have come forward to render voluntary service. Apart from them, ortho experts including Dr Sunil, Dr Bhaskar Ananda Kumar from Manipal, Dr Surya Prakash, Dr J Madhusudhan Rao have also agreed to render their valuable services to the patients in BIRRD. Besides, Dr Rajesh Malhotra, HoD of AIIMS, New Delhi has also given his nod to offer free services in BIRRD to the patients.

As a token of their valuable free services, TTD will provide accommodation, darshan, to and fro transportation from Tirumala to Tirupati and back, free of cost to these expert doctors and their families.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బ‌ర్డ్ ఆసుప‌త్రిలో స్వ‌చ్ఛంద విజిటింగ్ క‌న్స‌ల్టెంట్ల ఆహ్వానానికి అనూహ్య స్పంద‌న‌

– దేశ వ్యాప్తంగా 90 మందికి పైగా ప్ర‌ముఖ డాక్టర్ల ద‌ర‌ఖాస్తు

తిరుపతి, 2021 జూలై 23: టిటిడి బ‌ర్డ్ ట్ర‌స్టు ఆసుప‌త్రిలో స్వ‌చ్ఛందంగా విజిటింగ్ క‌న్స‌ల్టెంట్లుగా సేవ‌లందించేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆర్థోపెడిక్ డాక్ట‌ర్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని టిటిడి ఇచ్చిన ఆహ్వానానికి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఆర్థోపెడిక్ రంగంలో ప్ర‌ముఖులైన వారు దేశంలోని పలుమూలల నుంచి 90 మందికి పైగా టిటిడికి త‌మ ద‌ర‌ఖాస్తులు పంపారు.

ఈ ద‌ర‌ఖాస్తుల‌న్నీ క్షుణ్ణంగా ప‌రిశీలించిన అనంత‌రం పలువురు ప్రముఖ డాక్టర్లను ఎంపిక చేయ‌డం జరిగింది.

వీరిలో కొందరు డాక్ట‌ర్లు నెల‌కు ఒక‌సారి, కొందరు 15 రోజులకు ఒక సారి ఆసుప‌త్రికి వ‌చ్చి రోగుల‌కు ఉచితంగా వైద్య‌సేవ‌లు అందిస్తారు. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలోనే ప్ర‌ముఖులైన‌ 16 మంది వైద్యులుబ‌ర్డ్ ఆసుప‌త్రికి వ‌చ్చి రోగుల‌కు త‌మ సేవ‌లు అందించనున్నారు. బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి ఆగస్టు 1వ తేదీ నుంచి వీరి షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

డాక్ట‌ర్ కె.కృష్ణ‌య్య‌ ( FRCS, MCH UK, KIMS Hyderabad) డాక్ట‌ర్ కృష్ణ కిర‌ణ్ ( AWMS Delhi, చీఫ్ క‌న్స‌ల్టెంట్, మెడి క‌వ‌ర్ హాస్పిట‌ల్) డాక్టర్ హేమంత్ ( ఆర్థిస్కోపి, బెంగుళూరు) ఇప్పటికే బర్ద్ లో ఓపి సేవలు అందించడంతో పాటు, సంక్లిష్టమైన ఆపరేషన్లు చేశారు.


డాక్ట‌ర్ సునీల్ అన్సన్గి (ఎంఎస్ ఆర్థో, పిజిఐ చండీగ‌డ్‌), డాక్టర్ ఐ వి రెడ్డి ( కిమ్స్ హెచ్ ఓడి) , డాక్ట‌ర్ బాల వ‌ర్ధ‌న్ రెడ్డి (ఎంఎస్ ఆర్థో, అపోలో హైద‌రాబాద్‌), డాక్ట‌ర్ సాయి ల‌క్ష్మ‌ణ్ అన్నే (ఎంఎస్ ఆర్థో, కిమ్స్‌, హైద‌రాబాద్‌), హైద‌రాబాద్‌కు చెందిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్లు శ్రీ చంద్ర‌శేఖ‌ర్ (ఎంఎస్ ఆర్థో), శ్రీ‌ వికాస్ రెడ్డి (ఎంఎస్ ఆర్థో), శ్రీ‌ విన‌య్ కిషోర్‌(ఎంఎస్ ఆర్థో) స్వ‌చ్ఛంద సేవ‌లు అందించేందుకు ముందుకు వ‌చ్చారు. వీరితో పాటు చేతుల శ‌స్త్ర‌చికిత్స నిపుణులు డాక్ట‌ర్ సునీల్ (ఎంఎస్, హైద‌రాబాద్‌), డాక్ట‌ర్ భాస్క‌ర్ ఆనంద్ కుమార్‌( సీనియ‌ర్‌ క‌న్స‌ల్టెంట్‌, మ‌ణిపాల్‌), డాక్ట‌ర్ సూర్య ప్ర‌కాష్ (వెన్నెముక శ‌స్త్ర చికిత్స సీనియ‌ర్ నిపుణులు, మెడిక‌వ‌ర్‌, హైద‌రాబాద్‌), డాక్ట‌ర్ జె.మ‌ధుసూద‌న‌రావు (ఎంఎస్ ఆర్థో, సిటి న్యూరో కేర్, హైద‌రాబాద్‌) ఎంపిక చేసిన వారిలో ఉన్నారు. బ‌ర్డ్ ఆసుప‌త్రిలో రోగుల‌కు స్వ‌చ్ఛందంగా సేవ‌లు అందిస్తారని ఆసుప‌త్రి ప్ర‌త్యేకాధికారి డాక్ట‌ర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి చెప్పారు. వీరితోపాటు ఢిల్లీ ఎయిమ్స్ హెచ్ ఓడి డాక్టర్ రాజేష్ మల్హోత్రా కూడా బర్డ్ లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.

ఈ సేవ‌ల‌కు ముందుకొచ్చే స‌ర్జ‌న్లు, డాక్ట‌ర్ల‌కు టిటిడి ప‌లు ప్ర‌యోజ‌నాలు కల్పిస్తోంది. వీరు వైద్య‌సేవ‌లందించేందుకు ఆసుప‌త్రికి వ‌చ్చినపుడు తిరుమ‌ల, తిరుప‌తిలో వ‌స‌తి కోసం గ‌ది కేటాయిస్తారు. డాక్ట‌ర్‌తోపాటు భార్య‌, పిల్ల‌ల‌కు ఉచితంగా విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు ఉచితంగా ర‌వాణా వ‌స‌తి క‌ల్పిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Text content