I-DAY CELEBRATED WITH PATRIOTIC FERVOUR IN TIRUMALA _ తిరుమలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

TIRUPATI, AUGUST 15: The 66 Independence Day has been celebrated with great patriotic fervour in Tirumala on Wednesday with Tirumala JEO Sri KS Srinivasa Raju hoisting the National Tri-colour flag in front of Vigilance and Security Office.
 
Addressing the occasion the JEO said, the fruits of freedom which we are enjoying is because of the great sacrifices made by many great personalities in freedom struggle. “It is now our turn to do our bit in the development of the country which could be possible only when we discharge our duties and responsibilities in our work places with committment”, he added.
 
Since TTD’s prime aim is to propagate Hindu Dharma, provide amenities to pilgrims visiting Tirumala Shrine, he called upon the officials and employees of various departments to dedicate in the service of pilgrims.
 
Additional CVSO Sri Shivakumar Reddy and other officials were also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

తిరుమల, 2012 ఆగస్టు 15: తిరుమలలో 66వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జెండా పండుగ అత్యంత వైభవంగా జరిగింది. విజిలెన్స్‌ కార్యాలయం ఎదుట జరిగిన ఈ వేడుకల్లో తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ముఖ్య అతిథిగా పాల్గొని వినీలాకాశంలో మువ్వన్నెల జెండాను లాంఛనంగా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతావని కోసం ఎందరో మహనీయులు నిబద్ధతతో పనిచేసి ఎన్నో త్యాగాలు చేశారన్నారు. తితిదే సిబ్బంది కూడా అలాంటి నిబద్ధతతో భక్తులకు సేవలందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన మనగుడి కార్యక్రమంలో 68 లక్షల మంది భక్తులు పాల్గొన్నట్టు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. భవిష్యత్తులో భక్తుల అవసరాల దృష్ట్యా తితిదే సాంకేతికంగా కూడా దర్శన మరియు వసతి కల్పన విధానాల్లో పెనుమార్పులు తీసుకొస్తున్నదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తితిదే అడిషనల్‌ సివిఎస్‌ఓ శ్రీ శివకుమార్‌రెడ్డి, ఇఇలు శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీ నరసింహమూర్తి, శ్రీ మనోహర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.