IInd Day of ANNUAL PAVITHROTSAVAM IN TIRUCHANUR _ శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా పవిత్ర సమర్పణ

TIRUCHANUR, SEPT 28: On the second day of Annual Pavithrotsavam in Sri Padmavathi Ammavari Temple, Pavithras, the garlands made from special thread are taken in a procession and used to decorate Goddess Padmavathi inside Temple on Friday afternoon.
 
TTD Chairman Sri K.Bapi Raju, TTD JEO Sri P.Venkatarami Reddy, DyEO(PAT) Sri Gopalakrishna, Sri Venugopal, AEO, Temple staff and others were present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా పవిత్ర సమర్పణ

తిరుపతి, 2012 సెప్టెంబరు 28: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారికి వైభవంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేసి ప్రభోధికి, ఆరాధన, హోమాలు చేపట్టారు.

మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. కాగా పవిత్రోత్సవాల కారణంగా ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, తిరుప్పావడసేవ, లక్ష్మీపూజ, పుష్పాంజలి ఆర్జిత సేవలను రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి జెఈఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి దంపతులు, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈఓ శ్రీ గోపాలకృష్ణ, ఆలయ అర్చకులు, ఏఈఓ శ్రీ వేణుగోపాల్‌ ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.