IMPORTANT RESOLUTIONA DURING TTD BOARD MEETING_ టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

Tirumala, 19 Feb. 19: The TTD Trust Board under the Chairmanship of Sri P Sudhakar Yadav has taken some important resolutions during the board meeting held at Annamaiah Bhavan in Tirumala on Tuesday.

Later the chairman briefed the media on the important decisions.

@ To sanction Rs.36.50crores to A1 Facility and Property Managers Pvt.Ltd.for a period of 3 years towards FMS services in southern area and Aswini hospital in Tirumala.

@ To sanction Rs.17.50crores to Kalpataru for a period of 3 years towards FMS services in Eastern part of Tirumala cottages.

@ To sanction Rs.8.50crores to Padmavathi for a period of 3 years towards FMS services in the cottages located on Western side.

@ Sanction of tenders worth Rs.28.50qqcrores towards improvements of Sri Padmavathi and Sri Srinivasa Kalyana Mandapams.

@ Towards special development works in Sankumitta Cottage area Rs.5.15crores has been sanctioned.

@ An amount of Rs.12.50crores sanctioned towards the construction of kitchen block on the Eastern side of Panchajanyam Rest House.

@ Conversion of 76 houses in F type quarters as suites at Rs.3.65crores to accommodate potu workers.

@ Additional Pilgrims Amenities Complex near B type quarters at a cost of Rs.47.44crores.

@ Extension of sanitation services of Sulabh International to one more year.

@ To meet the water requirements of Tirumala, construction of additional pipe line from Kalyani Dam stage 1 near Srinivasa Mangapuram to stage 2 at Srivarimettu at a cost of Rs.8.50crores.

TTD EO Sri Anil Kumar Singhal, Sri Dokka Jagannadham, Sri Bonda Umamaheswara Rao, Sri GSS Sivaji, Sri BK Parthasaradhi, Sri Rayapati Sambasiva Rao, Sri Challa Ramachandra Reddy, Smt Sudha Narayanamurthy, Smt Sapna Munagantiwar, Sri RudraRaju Padma Raju, Sri Meda Ramakrishna Reddy, Ex Officio Member, Sri Manmohan Singh, Dr M Padma, IAS, Spl Invitee Sri N Sri Krishna, Sri K Raghavendra Rao, JEOs Sri KS Sreenivasa Raju, Sri, CVSO Sri Gopinath Jatti, FACAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

తిరుమల, 19 ఫిబ్రవరి 2019: టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

– తిరుమలలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు తిరుపతిలోని కల్యాణిడ్యామ్‌ స్టేజ్‌-1(శ్రీనివాసమంగాపురం) నుండి స్టేజి-2(శ్రీవారి మెట్టు) వరకు అదనపు పైపులైన్‌ ఏర్పాటుకు రూ.8.50 కోట్లు మంజూరు. ఈ పంపింగ్‌ సామర్థ్యం పెంపు ద్వారా తిరుమలకు 14 ఎంఎల్‌డిల నీటిని సరఫరా చేసే అవకాశముంది.

– తిరుపతిలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపాలు మరియు శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపాల ఆధునీకరణకు రూ.8.32 కోట్లతో టెండర్లు ఆమోదం.

– తిరుమలలోని శంఖుమిట్ట కాటేజీల ప్రాంతంలో ప్రత్యేక అభివృద్ధి పనులు మరియు మరమ్మతులు చేయడానికి 5.15 కోట్ల రూపాయలు మంజూరుకు ఆమోదం.

– తిరుమలలో సాధారణ పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన సులభ్‌ ఇంటర్నేషనల్‌ సోషల్‌ సర్వీస్‌ సంస్థకు ఒప్పంద కాలపరిమితిని మరో ఏడాది పొడిగింపునకు ఆమోదం.

– తిరుమలలోని శ్రీవారి పోటు ఉగ్రాణంలో పని చేస్తున్న కార్మికుల కాంట్రాక్టు కాలపరిమితిని మరో ఏడాది పొడిగింపునకు ఆమోదం.

– తిరుమలలోని దక్షిణ ప్రాంత పరిధిలోని కాటేజీలు మరియు అశ్వని ఆసుపత్రిలో ఎఫ్‌ఎమ్‌ఎస్‌ సేవలను నిర్వహించేందుకుగాను ఏ1 ఫెసిలిటీ మరియు ప్రాపర్టీ మేనేజర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు 3 సంవత్సరాల కాలానికి కేటాయించేందుకు రూ.36.50కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుమలలోని తూర్పు ప్రాంత పరిధిలోని కాటేజీలు(అష్టవినాయక, నందకం, పాంచజన్యం, కౌస్తుభం) విశ్రాంతి గృహాల్లో ఎఫ్‌ఎమ్‌ఎస్‌ సేవలను 3 సం|| నిర్వహించేందుకుగాను కల్పతరు సంస్థకు కేటాయించేందుకు రూ.17.50 కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో అదనపు భోజనశాల మరియు వంటశాల నిర్మాణానికి రూ.4.95 కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుమలలోని పశ్చిమ ప్రాంత పరిధిలోని కాటేజీలు, విశ్రాంతి భవనాల్లో 3 సం|| ఎఫ్‌ఎమ్‌ఎస్‌ సేవలను నిర్వహించేందుకు పద్మావతి సంస్థకు కేటాయించేందుకు రూ.28.50కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుపతిలోని శ్రీనివాసం వసతి సమూదాయాల పరిధిలోని ఎఫ్‌ఎమ్‌ఎస్‌ సేవలను పద్మావతీ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ సంస్థకు 3 సం|| పాటు కేటాయించేందుకు రూ.17 కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి గృహం తూర్పు వైపున వంటశాల బ్లాకు నిర్మాణానికి రూ.12.50 కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుమలలోని ఎఫ్‌ టైపు క్వార్టర్సులో గల 76 నివాసగృహాలను సూట్లుగా మార్చి భక్తులకు కేటాయించేందుకు రూ.3.65 కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుమలలోని ‘బి’ టైపు క్వార్టర్స్‌ వద్ద అదనపు యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి రూ.47.44 కోట్ల రూపాయలు మంజూరు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ మన్మోహన్‌ సింగ్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ డా|| ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రాయపాటి సాంబశివరావు, శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీమతి సప్న, శ్రీబోండా ఉమామహేశ్వరరావు, శ్రీరుద్రరాజు పద్మరాజు, శ్రీచల్లా రామచంద్రారెడ్డి, శ్రీడొక్కా జగన్నాథం, శ్రీపొట్లూరి రమేష్‌బాబు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు, శ్రీఎన్‌.శ్రీకృష్ణ, శ్రీఅశోక్‌రెడ్డి, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.