GRAND PROCESSION OF SRI KRT ON FEB 20_ ఫిబ్రవరి 20న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు
Tirupati, 19 Feb. 19: As per temple traditions the utsava idols of Sri Kodandarama and his consort will be taken in a procession to Kupu Chandrapeta about eight kms away from Tirupati on February 20 morning.
The Snapana Tirumanjanam will be performed to the Idols as part of the annual Magha masa festivities and brought back to Sri KRT later in the evening.
The artists of HDPP, Dada Sahitya will participate in the processions and perform bhajans, kolatas etc.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 20న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు
తిరుపతి, 2019 ఫిబ్రవరి 19: తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 20వ తేదీ కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.
శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6.00 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9.00 గంటలకు చేరుకుంటాయి. అక్కడ ఉదయం 10.00 గంటలకు స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 గంటలకు అక్కడి నుండి బయల్దేరి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.