INDIAN CLASSICAL DANCE TREAT DURING G-DAY _ సింగపూర్‌ కళాకారుల సీతారామ కళ్యాణ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ

SINGAPORE TEAM STANDS AS A SPECIAL ATTRACTION 

14 STATES 916 ARTISTS SHOWCASE THEIR SKILLS 

Tirumala, 19 September 2026: A diverse array of classical and folk art forms from various states across India was showcased during Garuda Seva, captivating the devotees.

Besides the Indian states, for the first time ever, a team from Singapore has also performed charming the devotees.

A total of 32 teams with 916 artistes presented their talents  adding glitter and glamour to the vahana seva on Saturday evening.

On one hand Manipuri, Mohiniyattam, Kathak, Kathakali, Kuchipudi, Bharatanatyam respective state artforms allured the devotees while folk dances like Gondal, Dogri, Ghanta, Jihijihiya entertained them.

TTD board members, officials participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

గరుడసేవలో భక్తులకు విశేష ఏర్పాట్లు

సింగపూర్‌ కళాకారుల సీతారామ కళ్యాణ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ

తిరుమల, 2026 సెప్టెంబరు 19: తిరుమలలో శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగిన శ్రీవారి గరుడ వాహన సేవలో పలు విశేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

సింగపూర్‌ కళాకారుల తొలి ప్రదర్శన

గరుడ వాహన సేవ సందర్భంగా తొలిసారిగా సింగపూర్‌ నుంచి వచ్చిన కళాకారులు శ్రీ సీతారామ కళ్యాణంలోని పౌరాణిక పాత్రలను ప్రదర్శించి భక్తులను అలరించారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సామాన్య భక్తులకు ప్రత్యేక దర్శన మార్గం

సామాన్య భక్తులు గరుడ వాహన సేవను సులభంగా దర్శించుకునేందుకు తిరుమలనంబి నుంచి ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా వాహన దర్శనానికి అనుమతించారు.

15 రకాల ఆహార పదార్థాలు, పానీయాలు

గరుడసేవ సందర్భంగా భక్తులకు మొత్తం 15 రకాల మెనూ అందించారు. ఇందులో 8 రకాల ఆహార పదార్థాలు, 7 రకాల పానీయాలు ఉన్నాయి.

24 లక్షల సర్వింగ్స్‌కు అన్నప్రసాదం ఏర్పాట్లు

భక్తుల భారీ రాకను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్నప్రసాదం విభాగం ముందస్తు ప్రణాళికతో అన్నప్రసాదం, పానీయాలు, అల్పాహారం కలిపి సుమారు 24 లక్షల సర్వింగ్స్‌ అందించేలా ఏర్పాట్లు చేసింది.

గరుడసేవ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టి, భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పానీయాలు తదితర సౌకర్యాలను అందించింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.