International Vedic Seminar- English Dias in S.V.Vedic University _ శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వేద సమ్మేళనం ప్రారంభం

శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వేద సమ్మేళనం ప్రారంభం

తిరుపతి, 2010 మార్చి 04: తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేద సమ్మేళనం అత్యంత ఘనంగా ప్రారంభమైంది.

ఈ సమావేశంలో తెలుగు, సంస్కృత ఆంగ్ల సదస్సులను అగస్త్యవేదిక, యాజ్ఞవల్క్యవేదిక మాక్స్‌ముల్లర్‌ వేదికలలో వివిధ పండితవర్యులు తమ తమ పత్రాలను సమర్పించారు. రెండవరోజు సమావేశానికి అగస్త్యవేదికనందు అధ్యకక్షులుగా శ్రీవిష్ణుభట్ల సుబ్రహ్మణ్య సకలక్షణ ఘనపాఠిగారు వ్యవహరించారు. సభకు ముఖ్య అతిధిగా శ్రీనివాస దీక్షితులు విచ్చేసారు. వేదసంరక్షణ విశిష్టతను లోకానికి తెలియచేయడానికి గాను ఈసదస్సు తోడ్పడుతుంది. మొదటి పత్రాన్ని శ్రీ ఎ.వి.రమణదీక్షితులుగారు సమర్పించారు.

అధ్యకక్షులు- అత్యంత విశిష్టమైన సభాకార్యక్రమంగా దీన్ని పేర్కొన్నారు. తిరుమల కొండపై స్వామి సన్నిధానంలో ఈ కార్యక్రమంలో జరుగుతున్న అనుభూతి కల్గిస్తుందన్నారు. అసంతౌ వై వేదా: భరద్వాజ మహర్షి. వేదాధ్యయనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కృషి తితిదే అభినందించదగినదన్నారు. వివిధ భాషలు తెలిసిన పండితులు వారి అభిరుచికి తగిన విధంగా వారికి అవగాహన కల్గిన వేదికలలో పాల్గొని స్వామివారి ప్రధానార్చకులైన శ్రీ ఎ.వి. రమణదీక్షితులు వారు ”ఆరాయుకాణి” అనే అంశాన్ని గురించి వివరించారు. ఋగ్వేదం-8 అష్టక 8 అధ్యాయం 13వ పనస ఇది దారిద్య్ర నాశనం కార్యసిద్ధి కోసం ఉపయోగిస్తారు. ఇందు 5 ఋక్కులు ఉన్నాయని చెప్పారు. భవిషో వేమా-4 అధ్యా.

అరాయికాణే ఇటువంటిశ్లోకమే మరొకటి నీవు ఐహిక ఆముష్మిక కోరికలు తీరుటకు సర్వ ఆనర్థములు పరిహారార్థము శ్రీదేవితో కలిసి శ్రీనివాసుని కొలువు చేరమని కోరుట అని వివరించారు. అయితే ఇందులో పరమార్థం వ్యాకరణార్థాలకు అతీతంగా ఉంటుందని సామాన్యులు యోచనా పరిధిలోని ఆ అర్థాలు రావని కేవల సామాన్య మానవుల ధానార్జనకు గాను మంత్రాల ఉపదేశం జరగలేదని పేర్కొన్నారు. ఇవి లోకకల్యాణార్థం మాత్రమే ఇవి ప్రయోగింపబడ్డాయి. అజ్ఞానమనే అలక్ష్మిని నిర్మూలించి జ్ఞానమనే లక్ష్మిని పొందుటే పరమావధిగా గుర్తించాలన్నారు. అశాశ్వతమైన సంపదలు స్వాధీనం చేసుకునేందుకు మాత్రం ఇవి ఉపయోగింపపడినదని, ఈ మంత్రం యొక్క ప్రయోజనం అదికాదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని వివరించారు.

భవిష్యోత్తర పురాణ వైఖానసం అర్చావిధానం మున్నగువాటిని ఋగ్వేద విషయ సారాంశాన్ని సంగ్రహంగా అందించారు. ఈ మంత్రాలన్ని బ్రహ్మజ్ఞానానికి సాధనాలుగా గుర్తించాలన్నారు. మంత్రాన్ని అగాధమైన మటుగగా పోల్చిచూడబడింది. వాటి తాత్పర్యం రహస్యమని ఐహిక ఆముష్మిక అర్థాల ప్రయోజనం కాదని తెలిపారు.

ఆచార్యమార్తి వేంకట్రామశర్మ –

పుంసవన సంస్కారం వైజ్ఞానిక తత్త్వం షోడష సంస్కారములోని రెండవదైన అంతరార్థాలను తెలియచేసారు. యోగ్యమైన సంతానం కోసం ముందు తరాల వరకు పుణ్యం నిలపడానికి అమృతీపమైన బీజాన్ని కల్గి ఉండాలన్నారు. వివాహసంస్కారం యొక్క విశిష్టత అంత గొప్పదని పేర్కొన్నారు. పుట్టుకతో మానవునికి 3 ఋణాలు ఉన్నాయని పితృఋణం, దేవఋణం, దరుఋణం మొదలైనవి గర్భాదాన సంస్కారం. ధర్మాన్ని మనసులో ఉంచుకుంటే ధర్మపరమైన సంతాన భాగ్యము కల్గుతుంది.

పుంసవన సంస్కారం – పుష్యమ నక్షత్రంలో ఈ సంస్కారం చేస్తారు. బృహస్పతి దీనికి అభిష్టాన దేవత చక్కని సంతానం, పిండానికి యోగ్యత కల్గుతాయి. 2 లేక 3వ నెల ఇది చేయాలి. దీనికి ముఖ్య కాలంగా ఇది భావించారు. మర్రిచెట్టు తూర్పువైపు తిరిగిన రెండు పళ్లను తీసుకొని చిన్నపిల్లతో నూరిచ్చి తెల్లటి వస్త్రం ద్వారా రసం తీసి కుడిముక్కులో వేయాలని తద్వారా పుంసవన ప్రక్రియకు మార్గమేర్పడు తుందన్నారు. ప్రసవానికి ముందు తర్వాత మన వేదాలలో తెలియచేసిన సంస్కారాలు ఉపయోగించినట్లయితే సులువైన రీతిలో మనకు అనుకూల ఫలితాలిస్తాయని తెలియచేసారు. ఈ వేద సదస్సు ద్వారా ఈ సంస్కారాలు ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు అందరు గుర్తించడానికి అవకాశాన్ని కల్గించదని తెలిపారు.

ఆగమ డీన్‌ ఆచార్యులు

శ్రీ విష్యుభట్టాచార్యులు – క్రియావానేష బ్రహ్మవిదాం వరిష్ఠ: ఇది ముండకోషనిషత్తులో ఉన్న మంత్రం క్రియావంతుడైతే అతడు స్వామివారితో సంబంధం ఉండటమే క్రియ అది ఏది అయినా కావచ్చు. ప్రతిక్షణం ఆయన ధ్యానంతో ఐక్యం కావటం కూడా ఇందులో భాగమని అన్నారు. ఆగమ గ్రంధాలలో పేర్కొని క్రియకు అర్థమిదే అన్నారు. దేవయజ్ఞంలో పటం వద్ద ఒక్క సారి వెళ్లి నమస్కరించుట కూడా క్రియ అని చెప్పారు. శరణాగతితో స్వామి రూపాన్ని హృదయంలో నిక్షిప్తం చేసుకోవటం క్రియ అన్నారు.

అతత్‌ క్రియలు గృహస్థ, వానప్రస్థ ఇతరాలు. భూపరిక్ష కర్షణ, బింబ ప్రతిష్ట అర్చన పవితోత్సవం ఇవన్నీ క్రియ క్రిందే వస్తాయని తెలిపారు. బాహ్యేంద్రియ వ్యాపార, అంతరేంద్రియ వ్యాపార – సంస్కారాలన్నీ బాహ్యేంద్రియ వ్యాపార క్రింద వస్తాయి. శ్రౌత, పాక యజ్ఞాలు ఉత్తమ క్రియల క్రింద వస్తాయి. భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావడానికే ఈక్రియలన్నీ ఉపకరిస్తాయని వక్కాణించారు. వైఖాన మహర్షి తెలియచేసిన సమన్వయ దృష్ఠితో గ్రహించాలని వివరించారు. అనంతరం సత్కార కార్యక్రమం పత్ర సమర్పకులకు జరిగింది.

శ్రీ ఆచార్యమూర్తి వేంకట్రామ శర్మ వందన సమర్పణతో రెండవ రోజునాటి మొదటి పత్రం ముగిసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

The various tenets of Rig-Veda came under the scanner of Vedic scholars at the Max Mueller Vedika at the ongoing International Vedic Seminar on Thursday.

 Presenting a paper on Poetry in Rig-Veda, Dr S. Ranganatha of Bangalore said Vedic scripts were fountainheads of vocabulary. He said eminent Sanskrit writers like C S Shastri; Max Mueller etc had done monumental Research on Rig-Veda which had

 In his paper on  ‘Veda Purusha, Vidyaranya  Mahaswami ‘ Sri P Srinivas Bangaraiah sarma of Bangalore highlighted the achievements of Vidyaranya, a saint of the Vijayanagara period and extolled his contributions to Sanskrit and puranic lores of the country.

Prof P Y Murali Manoihar Parek of Gorakhpur presented a paper on ‘elements of creation in Purusa and Hiranya Garbha Sukta of Rigveda. Prof Ganesh Umakant Thite addressed the issue of compilation of Vedic scripts in his paper on Problems in Vedic Bibliography.

In all four scientific and research papers were presented at the discourses in the Max Mueller Vedika on Thursday.

Prof  P C Murali Madhavan , Kalady Kerala ( Little known facts about Veda) Prof  Madhavi Katnat of Pune(Vaidika Sanskrit)  and Dr Manjunatha  Shreti (Sama Veda and Music)  and finally  Dr R Madhavi  ( Games in Vaidika activities)presented  expert commentaries and research documents on various  issues of Veda  and .

 Sri, I Y R Krishna Rao, executive officer of the TTD presented a certificate to large number of experts and Sanskrit research scholars on the occasion.