ISRO CHIEF OFFERS PRAYERS TO HILL LORD_ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న‌ఇస్రో ఛైర్మ‌న్ శ్రీ కె.శివ‌న్

Tirumala, 13 Jul. 19: The Chairman of Indian Space Research Organisation (ISRO) Sri K Sivan offered prayers to Lord Venkateswara at Tirumala on Saturday.

As ISRO is all set ready for its prestigious Lunar Space Mission-Chandrayaan 2 on July 15, the ISRO chief paid a visit to the Hill Shrine along with the replica of Chandrayaan 2 to receive the benign blessings of Almighty.

Later he was offered Vedasirvachanam at Ranganayakula Mandapam by vedic pundits. Temple DyEO Sri Harindranath offered Theertha Prasadams to the ISRO Chief.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న‌ఇస్రో ఛైర్మ‌న్ శ్రీ కె.శివ‌న్

తిరుమల, 2019 జూలై 13: తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ శ్రీ కె. శివన్ శనివారం ద‌ర్శంచుకున్నారు.

జూలై 15న ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ – 2 (లూనార్ స్పేస్ మిషన్‌) ప్ర‌యోగం శ్రీ‌వారి అనుగ్ర‌హంతో విజ‌య‌వంతం కావాల‌ని చంద్రయాన్ – 2 ప్రతిరూపంతో స్వామివారిని ద‌ర్శించుకుని, పూజ‌లు నిర్వ‌హించారు.

ద‌ర్శ‌నానంత‌రం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం చేశారు. అనంత‌రం ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ ఇస్రో ఛైర్మ‌న్‌కు తీర్థ ప్రసాదాలను అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.