ITS A FUSION OF CLASSICAL TRIBAL DANCE _ గరుడ వాహన సేవలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంచిన కళా బృందాల ప్రదర్శనలు

TIRUPATI, 03 DECEMBER 2024: The annual Brahmotsavam at Tiruchanoor has become a platform for the display of a variety of dance forms.

On the sixth evening, in front of Garuda Vahanam the classical artforms like Dhamaruka Dhwani, folk arts like Kolatam, Kadapa Drums, pooja kunita were performed.

A total of 15 teams comprising 311 artists presented their talents and allured the devotees.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గరుడ వాహన సేవలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంచిన కళా బృందాల ప్రదర్శనలు

తిరుపతి, 2024 డిసెంబరు 03: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గరుడ వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాబృందాల ప్రదర్శనలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 15 కళాబృందాలు 311 మంది కళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు.

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన 15 మంది కళాకారులు ఆ రాష్ట్ర సాంప్రదాయ పూజా కునిత నృత్యం, 28 మంది యువతులు ‘నమస్తే గరుడ రథీ’ నృత్యం నేత్రపర్వంగా సాగింది.

బృందంలోని 35 మంది చిన్నారులు కోఆర్గి నృత్యం, బెంగుళూరుకు చెందిన 28 మంది మహిళా కళాకారుల గజలక్ష్మి నమోస్తుతే – భరతనాట్యం భక్తులకు

తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు వెంకటేశ్వర వైభవం, శ్రీనివాస కళ్యాణం, వివిధ దేవతామూర్తుల వేషధారణ, భరతనాట్యం, కోలాటాలు అలరించాయి.

కడపకు చెందిన 31 మంది చిన్నారులు ముద్ర డాన్స్, కొవ్వూరుకు చెందిన 30 మంది యువతులు డమరుకం డాన్స్ భక్తులలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంపొందించింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది