టిటిడి వసతి సమూదాయాలపై టిటిడి తిరుపతి జెఈవో సమీక్ష

టిటిడి వసతి సమూదాయాలపై టిటిడి తిరుపతి జెఈవో సమీక్ష

తిరుపతి, 2019 ఫిబ్రవరి 11: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలోని టిటిడి వసతి సమూదాయాలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని మీటింగ్‌హాల్‌లో సోమవారం సాయంత్రం తిరుపతి రిసెప్షన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వసతి గృహలలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా తాగునీరు, అన్నప్రసాదాలు, లగేజి కౌంటర్లు, మరుగుదోడ్లు, తదితర విషయాలపై సమీక్షించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షించి కొరత ఉన్న చొట్ల తక్షణం ఏర్పాటు చేయాలన్నారు.

అదేవిధంగా తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం వసతి సమూదాయాలు, ఎస్వీ అతిథి భవనం, శ్రీ పద్మావతి అతిథి భవనం, శ్రీ గోవిందరాజస్వామివారి ఉచిత వసతి సమూదాయాలు, తలకోనలోని వసతి గృహలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి వసతి సమూదాయంపై సమీక్ష

తిరుచానూరులో టిటిడి నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి వసతి సమూదాయాలలో తాగునీరు, లాకర్లు, నీటిసరఫరా, ఫర్నిచర్‌, తదితర సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకురావాలని అదికారులను ఆదేశించారు. అదేవిధంగా అసంపూర్ణంగా ఉన్న ఇంజినీరింగ్‌ పనులను పూర్తిచేయాలన్నారు. వసతి సమూదాయంలో అవసరమైన సిబ్బందిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి రిసెప్షన్‌ అధికారులు శ్రీమతి కస్తూరి, శ్రీ చెంగల్రాయులు, శ్రీ లక్ష్మీ నరసింహ, విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.