RENDER SERVICES TO PILGRIMS IN BEST POSSIBLE WAY ON R-DAY-TIRUMALA JEO_ రథసప్తమినాడు భక్తులకు క్రమశిక్షణతో సేవలందించాలి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
Tirumala, 11 Feb. 19: The Srivari Sevakulu should render services to pilgrims in their allotted service points with dedication, said, Tirumala JEO Sri KS Sreenivasa Raju.
Addressing Srivari Sevakulu and scouts in Asthana Mandapam on Monday evening, the JEO said it is great to see that nearly 3500 sevakulu hailing from the states of AP, TS, TN, Karnataka, Maharashtra and Orissa are taking part in Radhasapthami service. I wish you all do best possible services on the occasion which is no less than Garuda Seva of Brahmotsavams, he added.
We have deployed nearly 250 regular staffs in all galleries on deputation and also each mada street will be monitored by senior officer”, he maintained.
VGO Sri Manohar, Catering Officer GLN Shastry, Health Officer Dr Sarmista, PRO Dr T Ravi and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
రథసప్తమినాడు భక్తులకు క్రమశిక్షణతో సేవలందించాలి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
ఫిబ్రవరి 11, తిరుమల 2019: తిరుమలలో ఫిబ్రవరి 12న రథసప్తమి పర్వదినం నాడు శ్రీవారి వాహనసేవలను వీక్షించేందుకు విచ్చేసే భక్తులకు క్రమశిక్షణతో మెరుగ్గా సేవలందించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు కోరారు. రథసప్తమికి సేవలందించేందుకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు సోమవారం సాయంత్రం తిరుమలలోని ఆస్థానమండపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారు ఏడు వాహనాలపై దర్శనమిస్తారు కావున అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తారని తెలిపారు. భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా రథసప్తమికి తొలిసారిగా మాడ వీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. గ్యాలరీల్లో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించేందుకు 200 మందికిపైగా టిటిడి అధికారులకు, సిబ్బందికి నాలుగు మాడ వీధులలో విధులు కేటాయించినట్లు వివరించారు. ప్రతి గ్యాలరీలో టిటిడి సిబ్బందితోపాటు పారిశుద్ధ్య సిబ్బంది, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. గ్యాలరీల్లో తగినంత మంది భక్తులను నింపాలన్నారు. భక్తులకు సమయానుకూలంగా టి, కాఫి, అల్పాహారం, మజ్జిగ, అన్నప్రసాదాలు, సుండల్ అందేలా చూడాలన్నారు. ఆరోగ్య విభాగం సిబ్బందితో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు చెత్త తరలించేలా, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. అందరూ సమన్వయం చేసుకుని రథసప్తమి పర్వదినాన్ని విజయవంతం చేయాలని కోరారు. రూ.98 కోట్లతో నిర్మించిన శ్రీవారి సేవా సదనాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, మరింతగా శ్రీవారి సేవ ఆదరణ పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా.. టి.రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి విఎస్వో శ్రీ మనోహర్, ఆరోగ్యశాఖాధికారి డా.. శర్మిష్ట, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి, ఏపిఆర్వో కుమారి పి.నీలిమ, ఏఈవో శ్రీ గోపాలరావు, ఏఇ శ్రీ వరప్రసాద్, ఓఎస్‌డిలు శ్రీ ఫణిరంగసాయి, శ్రీ శ్రీధర్ ఇతర అధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఓడిశా రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.