JEO REVIEWS ON PERATASI AND NAVARATHRI BRAHMOTSAVAMS_ శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలకు మరింత విస్తృత ఏర్పాట్లు : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 25 September 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Tuesday reviewed with senior officers on Peratasi Saturdays and ensuing Navarathri Brahmotsavams.

The meeting took place at Annamayya Bhavan in Tirumala. During the departmentwise review on the preparedness of these twin important occasions, the JEO instructed the concerned on pilgrim crowd management efficiencies.

Later speaking to media he said, the VIP darshanam is limited to only protocol dignitaries on September 29, 30, October 6,7, 13, 14, 20 and 21 following the Peratasi Saturdays which are considered auspicious by Tamilians. He said, Rs.300 special entry darshan tickets, Divya Darshan ans Sarva Darshan tokens were cancelled on October 14 following Garuda Seva. The privilege darshans, anitha sevas also remain cancelled during the ensuing Navarathri Brahmotsavams, he added.

NO IRREGULARITIES IN ONLINE LUCKY DIP

Tirumala JEO Sri KS Sreenivasa Raju cleared that there are no irregularities in Online Lucky Dip system.

He said, the application was prepare as pilgrim friendly by TTD. But some middlemen are misusing the application encashing the weakness of some pilgrims to have darshan of Lord by any means.

He said, the TTD vigilance are plunged into action to catch hold of the miscreants and asserted that no one will be spared. He appelaed to devotees not to fall prey to such touts and make use of the TTD application in a proper way.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలకు మరింత విస్తృత ఏర్పాట్లు : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

సెప్టెంబరు 25, తిరుమల 2018: అఖిలాండకోటి బ్రహ్మండనాయుకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామివారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలు మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలో అన్నమయ్య భవనంలో మంగళవారం అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలు, దసర శెలవులు, తమిళులకు ముఖ్యమైన పెరటాశి నెల సందర్భంగా స్వామివారి దర్శనానికి అత్యధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా

– సెప్టెంబరు 29, 30, అక్టోబరు 6, 7, 13, 14, 20, 21వ తేదీలలో వచ్చే శని, ఆది వారాలలో ప్రోటోకాల్‌ వి.ఐ.పి.లకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు కల్పించబడతాయని, సిఫార్సు లేటర్లపై ఇచ్చే బ్రేక్‌ దర్శనాలను రద్దుచేశామన్నారు.

– సెప్టెంబరు 29, అక్టోబరు 6, 13, 20వ తేదీలలో వచ్చే శనివారాలలో దివ్య దర్శనం టోకెన్లు నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.

– అదేవిధంగా అక్టోబరు 14వ తేదీ ఆదివారం శ్రీవారి గరుడ సేవ సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు జారీ చేయబడవని తెలియజేశారు.

– గరుడసేవ తర్వాత భక్తుల రద్దీ దృష్ట్యా పరిమిత సంఖ్యలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు వివరించారు.

– సర్వదర్శనం భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా లేపాక్షి సర్కిల్‌ నుండి ఆళ్వార్‌ ట్యాంక్‌, నారాయణగిరి ఉద్యానవనాల వరకు ఉన్న క్యూలైన్లు, ముల్లగుంటలో నూతన క్యూ లైన్లను ఏర్పాటు చేసి, క్రమపద్దతిలో దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.

శ్రీవారి ఆర్జితసేవల లక్కీడిప్‌లో ఎలాంటి అక్రమాలు లేదు

శ్రీవారి ఆర్జితసేవలకు సంబంధించిన లక్కీడిప్‌లో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని, ఇందుకొరకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి లోపాలు లేవని తిరుమల జెఈవో స్పష్టం చేశారు. ఇదివరకు సేవ టికెట్లు పొందే భక్తుల ఫోటోలు, ఆధార్‌ కార్డును అప్‌లోడ్‌ చేసేవారని, భక్తుల సౌకర్యార్థం సరళికృతం చేయడంలో భాగంగా వీటిని తీసివేసినట్లు తెలిపారు. లక్కీడిప్‌ విధానంలో కొందరు అక్రమార్కులు డబ్బులు సంపాదించాలని దురాశతో నకిలి ఐడి కార్డులతో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అదేవిధంగా భక్తులు ఎలాగైన స్వామివారిని దర్శించుకోవాలనే కోరికతో అధిక మొత్తం డబ్బులు అక్రమార్కులకు చెల్లిస్తున్నారన్నారు. అటువంటి వారిపై టిటిడి నీఘా విభాగం, పోలీస్‌ విభాగాలు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. టిటిడి అధికారులు త్వరలో దీనిపై సమగ్ర నివేదికను టిటిడి ఈవోకు అందివ్వనున్నట్లు తెలిపారు. టిటిడి శ్రీవారి భక్తులకు పారదర్శకమైన సేవలందిస్తుందని, కావున భక్తులు కూడా అంతే పారదర్శకంగా సేవలు పొందలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సిఈ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జ్‌ సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్వీబిసి సిఈవో శ్రీ నగేష్‌, ఎస్‌ఈ-2 శ్రీ రామచంద్రరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, ఆరోగ్య విభాగం అధికారి డా|| శర్మిష్ఠ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.