PAVITROTSAVAMS CONCLUDES IN SRI PAT_ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

Tiruchanoor, 25 Sep. 18: : The annual three day Pavitrotsavams concluded on a grand note in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor on Tuesday.

Pavitra Visarjana, Shanti Homam and Purnahuti were performed on this occasion by temple priests in Yaga Shala located at Sri Krishna Mukha Mandapam.

Later in the evening, Sri Padmavathi Ammavaru, Sri Krishna swamy, Sri Sounderaraja Swamy were taken out on a celestial procession.

Special Grade DyEO Sri Muni Ratnam Reddy and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి, 2018 సెప్టెంబరు 25: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల‌పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు మంగ‌ళ‌వారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు.

వైభవంగా చక్రస్నానం :

మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, కొబ్బరినీళ్ళతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి పద్మపుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది.

సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారు, శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. రాత్రి రక్షాబంధనం, ఆచార్య, ఋత్విక్‌ సన్మానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ దంపతులు, ఆలయ‌ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈఓ శ్రీమునిరత్నంరెడ్డి, ఏఈఓ శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.