JEO BRIEFS ON TTD ACTIVITIES TO TRAINEE IAS OFFICERS _ ట్రైనీ ఐఏఎస్‌లకు టిటిడి కార్యకలాపాలపై అవగాహన
Tirumala, 11 Jan. 20: JEO Sri P Basanth Kumar, briefed the Trainee IAS Officers on the various activities of Tirumala Tirupati Devasthanams with the help of a power point presentation.
The briefing session was held at Annamaiah Bhavan in Tirumala on Saturday. The JEO informed the team of Trainee IAS Officers about Darshan, Accommodation, Reception, Tonsuring, Laddu Prasadam, Annaprasadam, Parakamani, Sanitation and Srivari Seva activities with relevant information.
Later they visited Annaprasadam Complex, Laddu Complex, and Kalyanakatta Complex to study the activities in the respective areas.
DEO and Liaison Officer Sri Ramanaprasad, Catering Officer Sri Sastry, Reception DyEO Sri Balaji, Kalyanakatta DyEO Smt Nagaratna, Temple Peishkar Sri Lokanatham, Potu Peishkar Sri Srinivasulu were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ట్రైనీ ఐఏఎస్‌లకు టిటిడి కార్యకలాపాలపై అవగాహన
తిరుమల, 2020 జనవరి 11: టిటిడి కార్యకలాపాలపై 20 మంది శిక్షణ ఐఏఎస్‌లకు తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో అవగాహన కల్పించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి అమలుచేస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలు, వైద్య శాలలు, విద్యాసంస్థల గురించి వివరించారు. టెక్నాలజీ సాయంతో పారదర్శకంగా భక్తులకు అందిస్తున్న సేవలు, లడ్డూ ప్రసాదాల పంపిణీ, వసతి, దివ్యదర్శనం టైంస్లాట్, ఆన్‌లైన్ సేవలు, పారిశుధ్యం, శ్రీవారి సేవ కార్యకలాపాలను తెలిపారు. అదేవిధంగా టిటిడి స్థానికాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టిటిడిలో పరిపాలన క్రమశ్రేణి, అధికారుల బాధ్యతలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను వారికి తెలియజేశారు. టిటిడి నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులు, వేద విద్యవ్యాప్తికి తీసుకుంటున్న చర్యలు వివరించారు.
తరువాత వారు అన్నప్రసాదం కాంప్లెక్స్, లడ్డూ కాంప్లెక్స్, కళ్యాణకట్ట కాంప్లెక్స్ సందర్శించి ఆయా ప్రాంతాలలో కార్యకలాపాలను అధ్యయనం చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిఈవో మరియు లైజన్ అధికారి డా..రమణప్రసాద్, సెట్విన్ సిఈవో మరియు ప్రభుత్వ లైజన్ అధికారి శ్రీ మురళికృష్ణ, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి, రిసెప్షన్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజీ, కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ పేష్కార్ శ్రీ లోకనాథం, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.