JEO COMPLIMENTS TTD OFFICIALS FOR G-DAY SUCCESS_ శ్రీ‌వారి గరుడసేవను విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు :తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 16 October 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Tuesday complimented the officers who were specially deployed in four mada streets for Garuda Seva and felicitated them for making the big event a major success.

During the daily review meeting at Brahmotsavam conference hall set up temporarily in front of Rambhageecha 2, the JEO said all the wings including Engineering, Vigilance, Annaprasadam, Health, PR department(Srivari Seva) have discharged impeccable services in four mada streets on Garuda Seva day.

The sectoral officers, line in-charges have extremely good in their duty areas and even our Executive Officer Sri Anil Kumar Singhal also expressed his immense satisfaction with the collective work. I wish you all to continue with the same spirit in future too, he added.

Earlier, the trainee IAS have shared their observations with JEO and thanked TTD for giving them an opportunity which will be helpful for them in future.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ‌వారి గరుడసేవను విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు :తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 16 అక్టోబరు 2018: శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల‌లో భాగంగా ఆదివారం సాయంత్రం తిరుమ‌ల‌కు విచ్చేసిన ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు ప్ర‌శాంతంగా దర్శనభాగ్యం కల్పించి శ్రీవారి గరుడ వాహనసేవ విజయవంతమ‌య్యేందుకు కృషి చేసిన టిటిడి అధికారులు, సిబ్బంది, పోలీసులు, డెప్యుటేషన్‌ సిబ్బందికి టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అభినందనలు తెలియజేశారు. తిరుమలలోని రాంభగీచా విశ్రాంతి గృహం ఎదురుగా గల కంట్రోల్‌ సెంటర్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం అధికారులతో జెఈవో సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి సిబ్బంది స‌మిష్ఠిగా పోలీస్ శాఖ‌వారితో స‌మ‌న్వ‌యం చేసుకుని గ‌రుడ‌సేవను విజ‌య‌వంతం చేశార‌ని తెలిపారు. నాలుగు మాడ వీధుల‌లోని గ్యాల‌రీల‌లో వేచివున్న భ‌క్తుల‌కు ఎలాంటి ఆసౌక‌ర్యం క‌లుగ‌కుండా టిటిడి ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ. బాలాజీ ఆధ్వ‌ర్యంలో 11 మంది సీనియ‌ర్ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సేవ‌లందించిన‌ట్లు వివ‌రించారు.

అదేవిధంగా గ్యాలరీల్లోని భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు, మంచినీరు, మ‌జ్జిగ‌ అందించిన అన్న‌ప్ర‌సాదం, ఆరోగ్య విభాగాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ భక్తులకు విశేషసేవలు అందించారని కొనియాడారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు టిటిడి ఇంజినీరింగ్‌, భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో వ్యవహరించారని తెలిపారు.

ఈ సమావేశంలో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ సుధాక‌ర్‌రావు, ఆరోగ్య విభాగం అధికారి డా.శ‌ర్మిష్ఠ, శ్రీ‌వారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.