SUN SHINES ALL THE WAY FOR SURYA PRABHA VAHANAM_ సూర్యప్రభ వాహనంపై శ్రీ‌మ‌హావిష్ణువు అభ‌యం

Tirumala, 16 October 2018: On the seventh day of Srivari Navaratri Brahmotsavams the Sri Malayappa Swamy took a celestial ride atop the bright Surya Prabha Vahanam on Tuesday morning.

Surya, the Sun God, who is the key architect of life of humans, animals and plants became the Charioteer to drive the Surya Prabha Vahanam for Sri Malayappa Swamy who cheered the devotees as Surya Narayanamurthy.

According to Puranic texts Surya, the Sun God always rode on a chariot driven by seven horses. He spreads light and health in the world and also removes darkness, which symbolizes poverty, illiteracy and ignorance.. Saint-poet Tallapaka Annamacharyat praises Venkatewswara as no other than the Sun God in the midst of the Sun’s Sphere.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, VGOs Sri Raveendra Reddy, Smt Sadalakshmi, Temple Staff and devotees took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై శ్రీ‌మ‌హావిష్ణువు అభ‌యం

అక్టోబ‌రు 16, తిరుమల 2018: తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలలో ఏడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం శేషాచలాధీశుడు సూర్యప్రభ వాహనంపై గ‌ద‌, క‌మ‌లం ధ‌రించిన శ్రీ‌మ‌హావిష్ణువు అలంకారంలో తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్య‌నారాయ‌ణుడు స‌ప్త అశ్వాల‌తో ర‌థాన్ని న‌డుపుతూ స్వామివారిని తీసుకెళుతున్న‌ట్టుగా సూర్య‌ప్ర‌భ వాహ‌నాన్ని రూపొందించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి చంద్ర‌ప్ర‌భ వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్, విఎస్‌వోలు శ్రీ ర‌వీంద్రారెడ్డి, శ్రీ‌మ‌తి స‌దాల‌క్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.

అక్టోబ‌రు 17న స్వ‌ర్ణ‌రథోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌వారం స్వ‌ర్ణ‌రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 4.10 నుండి 4.45 గంటల వరకు క‌న్యా లగ్నంలో స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7 గంటలకు స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం మొద‌ల‌వుతుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.