JEO (H & E) COMPLIMENTS TTD STUDENTS FOR BAGGING IIIT SEATS _ టీటీడీ విద్యార్థులకు ట్రిపుల్ ఐటి లో సీట్లు

JEO FACILITATES STUDENTS, PARENTS AND TEACHERS

 

TTD SUPPORTS & ASSIST STUDENTS TO SCALE GREATER HEIGHTS

 

Tirupati, 06 October 2022: TTD JEO for Health and Education Smt Sada Bhargavi on Friday said that TTD would support and also assist its students to scale new heights in their academic studies.

 

Earlier she felicitated K Jeevan Kumar from SV High school in Tirumala &  R Haritha from Sri Kodandarama English medium school with shawls for bagging seats in the IIIT and lauded their parents, school headmasters at her chambers in the TTD administrative building on Thursday.

 

Speaking on the occasion the JEO said the achievements of these students should become a role model for other students and TTD will provide all support and assistance to them to move forward in their careers.

 

DEO of TTD Sri Govindarajan and the respective headmasters, Sri Krishnamurthy and Sri Surendra Babu were present.

 

WILL BECOME A DISTRICT COLLECTOR- SAYS HARITA

 

Harita Bai of Sri Kodandarama English medium school run by TTD had an impressive 559 marks and bagged seat at Idupulapaya IIT and her mother  Shyamala bai was a fruit vendor.

 

Harita said she would write civil exams and become a district collector and serve poor.

 

AIM TO BE A SOFTWARE ENGINEER- JEEVAN KUMAR

 

Jeevan who studied at TtD’s SV High school in Tirumala said his father worked as a sales assistant at a shop in Tirumala and mother does tailoring at home.

 

He said his ambition is to do M.Tech and become a software engineer and bring laurels to TTD and his parents.

 
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ విద్యార్థులకు ట్రిపుల్ ఐటి లో సీట్లు

– విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులను అభినందించి సన్మానించి జెఈవో శ్రీమతి సదా భార్గవి

– ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి సహాయ, సహకారాలు అందిస్తామన్న
జెఈవో

తిరుపతి 6 ఆక్టోబరు 2022: టీటీడీ విద్యాసంస్థల్లోని తిరుమల ఎస్వీ హైస్కూలు కు చెందిన కె. జీవన్ కుమార్, తిరుపతి శ్రీ కోదండరామ ఇంగ్లీష్ మీడియం హైస్కూలు కు చెందిన ఆర్.హరిత బాయ్ ట్రిపుల్ ఐటి లో సీట్లు సంపాదించారు. ఈ సందర్భంగా జెఈవో శ్రీమతి సదా భార్గవి గురువారం తన చాంబర్ లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా జెఈవో శ్రీమతి సదా భార్గవి విద్యార్థుల తో ముచ్చటించారు. టీటీడీ విద్యాసంస్థల నుంచి గొప్ప చదువులకు ఎంపికయ్యే విద్యార్థులకు యాజమాన్యం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఇలాంటి విద్యార్థులు మిగిలిన వారికి స్ఫూర్తి నివ్వగలరని ఆమె చెప్పారు. పేదరికం చదువుకు అడ్డు కాదనే విషయం రుజువు చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రోత్సహించిన ఉపాధ్యాయులు 

అభినందనీయులని ఆమె చెప్పారు. విద్యార్థులకు శాలువా కప్పి ఆశీర్వదించారు. డి ఈవో శ్రీ గోవింద రాజన్, ప్రధానోపాధ్యాయులు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ సురేంద్ర బాబు పాల్గొన్నారు.

కలెక్టర్ అయ్యి పేదలకు సేవ చేస్తా…

తిరుపతి శ్రీ కోదండ రామ ఇంగ్లీష్ మీడియం హైస్కూలు లో చదివిన హరిత బాయ్ పదో తరగతిలో 559 మార్కులు సాధించింది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి లో సీటు సాధించింది. ఈ అమ్మాయి అమ్మ శ్రీమతి శ్యామల బాయి బండి మీద పండ్లు అమ్ముకుని కూతురిని చదివిస్తున్నారు. తన తల్లి కష్టం చూసిన తాను సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి కలెక్టర్ అయ్యి టీటీడీ కి, తన తల్లికి మంచి పేరు తెచ్చి, పేదలకు సేవ చేస్తానని హరిత బాయి చెప్పారు.

సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవుతాను…

తిరుమల ఎస్వీ హైస్కూలు లో చదివిన కె. జీవన్ కుమార్ పదో తరగతిలో 585 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటిలో సీటు పొందాడు. ఇతని తండ్రి శ్రీ ముని వెంకటేష్ తిరుమలలో షాప్ లో పని చేస్తారు. తల్లి శ్రీమతి లావణ్య ఇంటివద్దే టైలరింగ్ చేస్తారు. వీరు కష్ట పడి కుమారుడిని చదివిస్తున్నారు.

తాను ఐఐటీ లో సీటు సాధించి ఎంటెక్ చదివి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థానాన్ని అందుకుని టీటీడీ కి, తన తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తానని జీవన్ కుమార్ తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది