JEO (HEALTH & EDUCATION) INSPECTS TTD PROJECTS _ టిటిడి ప్రాజెక్టులను తనిఖీ చేసిన జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

Tirupati, 16 Oct. 20: TTD JEO ( Health & Education) Smt Sada Bhargavi on Friday  inspected the activities of SVETA Bhavan and  other TTD projects.

She also reviewed the online training classes for TTD employees at the SVETA Bhavan.

The JEO inspection of TTD Projects included the activities of all TTD projects set up there like Central library and Research Centre,Alwar Divya Prabandha Project, Dravida Veda Nalayar  Divya Prabandha  Parayanam Project ,Purana Itihasa project ,Sri Srinivasa Telugu Vagmeya Adhyayana  Institute,Dasa Sahitya Project,Srinivasa Kalyanam and SV Vaibhaotsava projects.

She also reviewed the implementation of COVID-19 guidelines at the offices of all the projects..

Acharya Rajagopalan, OSD of Alwar Divya Prabandha project,Sri Anadathirtha Charyulu ,OSD of Dasa Sahitya project,Dr K Ramanjula Reddy, Director of SVETA  and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ప్రాజెక్టులను తనిఖీ చేసిన జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి
 
తిరుపతి, 2020 అక్టోబర్ 16: తిరుపతిలోని శ్వేత భవనంతోపాటు టిటిడి ప్రాజెక్టులను జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి శుక్రవారం తనిఖీ చేశారు.
 
శ్వేత భవనంలో టిటిడి ఉద్యోగులకు జరుగుతున్న ఆన్ లైన్ తరగతులను పరిశీలించారు. ఆదేవిధంగా శ్వేత భవనంలో గల కేంద్రీయ గ్రంథాలయం మరియు పరిశోధనా కేంద్రం, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ద్రవిడ వేద నాళాయిర దివ్యప్రబంధ పారాయణ పథకం, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, శ్రీ శ్రీనివాస తెలుగు వాఙ్మయ అధ్యయన సంస్థ, దాస సాహిత్య ప్రాజెక్టు, శ్రీనివాస కల్యాణం మరియు ఎస్వీ వైభవోత్సవం ప్రాజెక్టులను తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లో కోవిడ్-19 నేపథ్యంలో అనుసరిస్తున్న విధి విధానాలను పరిశీలించారు.
 
జెఈఓ వెంట ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య రాజగోపాలన్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, శ్వేత సంచాల‌కులు డా. కె.రామాంజుల‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.