LORD MALAYAPPA RIDES PEDDASESHA VAHANAM IN SRI GOVINDARAJA SWAMY AVATAR _ పెద్ద‌శేష వాహ‌నంపై శ్రీ‌ గోవింద‌రాజ‌స్వామివారి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Tirumala, 16 Oct. 20: On the day-1 of the on-going Srivari Navaratri Brahmotsavam, Sri Malayappa rode on Pedda Sesha Vahana in Sri Govindaraja Swamy alankaram.

As the Vahana seva held inside the Srivari temple in view of the COVID-19 restrictions Sri Malayappa Swamy and his, consorts rode the Pedda Sesha Vahana to bless the devotees.

Legends say that Adisesha, the serpent god was a friend of Sri Venkateshwara.  Sesha Vahanam symbolised the Saranagati cult of Sri Venkateshwara who has taken different avatars as Lakshmana and Balaram in other Yugas to be closely assisting Sri Narayana.

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, TTD EO Dr KS Jawahar Reddy, Parliament member Sri Vemireddy Prabhakar Reddy, Additional EO Sri A V Dharma Reddy, JEO Sri P Basant Kumar, Board members Sri DP Anant, Smt Prashanti Reddy, Sri Chippagiri Prasad, Sri Govind Hari, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, Temple DyEO Sri Harindranath, Peishkar Sri Jaganmohan Charyulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

పెద్ద‌శేష వాహ‌నంపై శ్రీ‌ గోవింద‌రాజ‌స్వామివారి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

అక్టోబ‌రు 16, తిరుమల 2020: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మొద‌టిరోజు శుక్ర‌వారం రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలో పెద్ద‌శేష వాహ‌న సేవ జ‌రిగింది.

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి అలంకారంలో అనుగ్ర‌హించారు. అనంత‌శ్చ అస్మి నాగానాం… స‌ర్పానాం అస్మి వాసుకిః… తాను నాగుల‌లో శేషుడిని, స‌ర్పాల‌లో వాసుకిని అని సాక్షాత్తు ప‌ర‌మాత్మ చెప్పిన‌ట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆదిశేషుడు త‌న శిర‌స్సుపై స‌మ‌స్త భూభారాన్ని మోస్తుంటారు. ఆదిశేషుడు శ్రీహరికి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి  అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. స్వామివారికి పానుపుగా, దిండుగా, పాదుక‌లుగా, ఛ‌త్రంగా, వాహ‌నంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిని ద‌ర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.

 కాగా, బ్ర‌హ్మోత్స‌వాల్లో రెండో రోజైన శ‌నివారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు చిన్న‌శేష వాహ‌నం, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు హంస వాహ‌నంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిస్తారు.
       
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్‌, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.