JEO INSPECTS AMARAVATHI TEMPLE WORKS_ అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం నిర్మాణపనులను పరిశీలించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
Vijayawada, 17 Jun. 19: Tirupati JEO Sri B Lakshmikantham on Monday inspected the ongoing construction works of Sri Venkateswara temple at Venkatapalem in Amaravathi.
The JEO observed Antarprakaram, Bahyaprakaram, Pushkarini and Anjaneya Swamy temple works taken up in the first phase. He instructed the officials concerned to complete the works within the stipulated time.
Spl.Gr.DyEO Sri Rajendrudu, EE Sri Prasad and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం నిర్మాణపనులను పరిశీలించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
తిరుపతి, 2019 జూన్ 17: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం నిర్మాణం పనులను సోమవారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం, అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారి ఆలయ నిర్మాణ పనులను లో భాగంగా మొదటి దశలో జరుగుతున్న అంతర ప్రాకారం, బాహ్య ప్రాకారం, మహారాజ గోపురం, కల్యాణోత్సవ మండపం, ఉత్సవ మండపం, పుష్కరిణి, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం తదితర నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీ ఆర్.రాజేంద్రుడు, ఈఈ శ్రీ ఎస్. ప్రసాద్, డెప్యూటీ ఇఇలు శ్రీ నాగభూషణం, శ్రీ ఆనందరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.