MALAYAPPA RIDES ON GARUDA_ తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
Tirumala, 17 Jun. 19: The Utsavamurthy of Sri Malayappa Swamy took, celestial ride on the mighty Garuda Vahana in Tirumala on Monday.
The pleasant evening witnessed the grandeur of Garuda Vahana Seva in the bright light of the full moon.
Lord glided along four mada streets surrounding the temple to bless His devotees who gathered in galleries.
Temple DyEO Sri Harindranath and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
జూన్ 17, తిరుమల 2019: తిరుమలలో సోమవారం రాత్రి 7.00 గంటలకు పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీమలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగుమాఢ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి.
శ్రమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరినీ కటాక్షించాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ లోకనాథం, విఎస్‌వో శ్రీమనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.