JEO INSPECTS ARRANGEMENTS FOR BTU IN SRINIVASA MANGAPURAM TEMPLE _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను తనిఖీ చేసిన జేఈవో
Tirupati, 24 February 2024: JEO Sri Veerabrahmam on Saturday inspected the arrangements for the annual Brahmotsavam of Sri Kalyana Venkateswara temple at Srinivasa Mangapuram scheduled from 29 February to March 8.
JEO directed garden, engineering and other departments to make coordinated efforts to ensure the success of the annual Brahmotsavam.
Among others, the Deployment of an adequate number of Srivari Sevakulu, live telecast by SVBC, all Dharmic projects to undertake cultural programs in front of Vahana Sevas, publicity through Prachara Ratham to neighbourhood villages, mobile toilets, additional sanitary workers, parking lots, vigilance and police coordination, deployment of vehicles.
He advised Temple Spl Gr.DyEO Smt Varalakshmi and CPRO Dr T Ravi to coordinate with all departments and ensure the success of the annual event.
SE(Electrical) Sri Venkateswarlu, Transport GM Sesha Reddy, EEs Sri Manoharam, Sri Prasad, Goshala Director Dr Harnath Reddy, Garden Deputy Director Sri Srinivasulu, Additional Health officer Dr Sunil Kumar, AEO Sri Gopinath, AVSO Sri Satish were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను తనిఖీ చేసిన జేఈవో
తిరుపతి, 24 ఫిబ్రవరి 2024: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం శనివారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై మార్చి 8వ తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు ఎలాంటి రాజీకి తావులేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల కటౌట్లు, దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని ముఖ్య ప్రజాసంబంధాల అధికారికి సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు.
ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటుచేయాలన్నారు. ప్రచార రథాల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. మొబైల్ మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ద్య కార్మికులను నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. విజిలెన్స్ అధికారులు చంద్రగిరి పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టాలని సూచించారు. వివిధ విభాగాలకు అవసరమైన వాహనాలను సమకూర్చాలని రవాణా విభాగం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఆలయ ప్రత్యేకాధికారి మరియు సీపీఆర్వో డా.రవికి సూచించారు.
జేఈవో వెంట ఎస్ఇ(ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, ఇఇలు శ్రీ మనోహర్, శ్రీ ప్రసాద్, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్‌కుమార్, ఏఈవో శ్రీ గోపీనాథ్, ఎవీఎస్వో శ్రీ సతీష్ తదితరులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.