JEO INSPECTS ARRANGEMENTS FOR SRI RAMAKRISHNA THEERTHAM MUKKOTI_ శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లను పరిశీలించిన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
Tirumala, 19 Jan. 19: TTD is making elaborate arrangements for convenience of devotees fortune holy ritual of Sri Ramakrishna Theertham Mukkoti slated for January 21.
The JEO inspected all preparation underway at Papavinasnam for devotees along with officials of all TTDs wings on Saturday morning.
Speaking on The occasion the JEO said the TTD engineering wing had put up three temporary sheds and the Anna prasadam wing would distribute Pulihara, curd rice packets, buttermilk and drinking water to devotees, Drinking water taps are drawn from Papavinasam and sign boards are put up for devotees information.
He instructed the TTDs health officer to give priority for hygienic conditions at Ramakrishna Thirtham and to organise sanitary workers to clean the surroundings.
He said both the Forest and vigilance wing would coordinate efforts to ensure hassle free visit to devotees. An ambulance and Para medical staff were kept in standby and the JEO appealed to devotees to protect the sanctity of the area and TTD forests.
Earlier the TTD JEO inspected GNC, Lepakshi, Padmavati guesthouse areas and the SAMC circle tat Tirumala and reviewed with officials up sign boards put up at four prominent locations in English, Telugu about the event.
INSPECTIONS AT TIRUMALA
Speaking to media later the JEO said sign boards were organised in English and Telugu at four prominent locations about Mukkoti event .The sign boards at GNC, Sannidhanam, Padmavati Guest House and Seshadri nagar will help devotees how to reach the location for Mukkoti celebrations. The information is currently available on Flexis and soon permanent boards will be installed at all junctions of Tirumala giving information about surroundings spits for devotees.
SE-2 Sri Ramachandra Reddy, Health Officer Dr Shermista, DyEO Reception Sri Balaji, VSO Sri Manohar, EE Sri Subramanyam and other officials participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లను పరిశీలించిన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
జనవరి 19 తిరుమల 2019: తిరుమలలోని వివిధ ప్రముఖ తీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి జనవరి 21వ తేదీ సోమవారం జరుగనున్న నేపథ్యంలో అందుకు విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. పాపానాశనం వద్ద భక్తుల సౌకర్యార్థం టిటిడి చేస్తున్న ఏర్పాట్లను శనివారం జెఈవో వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున టిటిడి అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తునట్లు తెలిపారు. ఇందులో భాగంగా టిటిడి ఇంజినీరింగ్ విభాగంవారు తాత్కాలిక షేడ్లు, అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో పులిహోర, పెరుగన్నం ప్యాకెట్లు, మజ్జిగ, తాగునీరు బాటళ్ళు అందిస్తామన్నారు. పాపావినాశనం నుండి త్రాగునీటి కొళాయిలు, భక్తులకు అవసరమైన సమాచార బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. రామకృష్ణ తీర్థం వద్ద పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యం ఇవ్వాలని అందుకు అనుగుణంగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చెయ్యాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
అటవీశాఖ మరియు టిటిడి విజిలెన్స్ సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చెపట్టినట్లు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఒక అంబులెన్స్‌ను, పారామెడికల్ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. రామకృష్ణ తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులు అటవీ ప్రాంతాన్ని కాపాడాలని జెఈవో విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో జెఈవో తనిఖీలు
అంతకుముందు తిరుమలలో వివిధ ప్రాంతాలను సులభంగా చేరుకోవడానికి భక్తుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను టిటిడి అధికారులతో కలిసి జెఈవో పరిశీలించారు. ఇందులో భాగంగా జిఎన్‌సి, లేపాక్షి, పద్మావతి వసతి సమూదాయాలు, ఎస్‌ఎమ్‌సి కూడళ్ళను పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి, మొదటగా నాలుగు ముఖ్యమైన ప్రాంతాలలో తెలుగు, ఇంగ్లీష్ బాషలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా జిఎన్‌సి, సన్నిదానం, పద్మావతి వసతి సమూదాయాలు, శేషాద్రినగర్ వద్ద భక్తులు ఈ సూచిక బొర్డుల ద్వారా తాము చేరుకోవలసిన ప్రాంతాలను సులభంగా గుర్తించి చేరుకుంటునట్లు తెలపారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని మొదటగా పెక్సీలలో ఏర్పాటు చేసి, తదుపరి శాశ్వత బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో తిరుమలలోని అన్ని కూడళ్లలో ఉన్న పరిసర ప్రాంతాలకు సంబంధించిన సమాచారంతో బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో ఎస్.ఇ.2 శ్రీ రామచంద్రా రెడ్డి, ఆరోగ్యవిభాగం అధికారిణి డా|| శర్మిష్ఠ, రిసెప్షన్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, విఎస్‌వో శ్రీమనోహర్, ఇఇ శ్రీ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.