GRAND BHAJAN SHOBA YATRA BY TTD DASA SAHITYA PROJECT_ టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర

Tirupati, 19 Jan. 19: As part of Srivari Quarterly Metlotsavam a grand Shoba Yatra of bhajan mandals was organised by the TTDs Dada Sahitya project in temple town of Tirupati on Saturday evening.

The three-day metlotsavam was kicked off this morning at the Third Choultry, behind Railway station with bhajan mandals conducting suprabatha meditation, and collective bhajans. The bhajan mandal members were also later trained in new sankeertans, Bhakti message etc.

The OSD of Dasa sahitya project Sri Anandathurtha charyulu, DyEO Smt Jhansi Rani performed special poojas at Sri Govindaraja Swamy Temple before commencing the Shoba Yatra.

Speaking on the occasion tne OSD said Govinda Nama sankeerthana was the only path for bliss and 3000 Devotees from AP, Telangana, Karnataka and Tamilnadu were participating in tne Shoba Yatra. The Shoba Yatra will reach the TTDs third choultry from Sri Govindaraja Swamy Temple as devotees chant sankeertans.

He said the Shoba Yatra would conclude on January 21 following Special pujas at Padala Mandapam and trek the Alipiri route to Tirumala.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర

తిరుపతి, 2019 జనవరి 19: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనమండళ్ల శోభాయాత్ర శనివారం సాయంత్రం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగా తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత భజన మండలి సభ్యులకు కొత్త సంకీర్తనలు నేర్పడం, ధార్మిక సందేశం, మానవాళికి హరిదాసుల ఉపదేశాలు అందించారు.

సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద ఇన్‌చార్జి డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణితో కలిసి టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీఆనందతీర్థాచార్యులు శ్రీవారి ప్రచారరథంలోని స్వామివారికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ కలియుగంలో నామసంకీర్తన ముక్తికి మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 3 వేల మందికిపైగా భజనమండళ్ల సభ్యులు శోభాయాత్రలో పాల్గొన్నట్టు తెలిపారు. శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుంచి భజనలు, కోలాటాలతో శోభాయాత్ర రైల్వేస్టేషన్‌ వెనకవైపు గల మూడో సత్రం ప్రాంగణానికి చేరుకుందన్నారు. జనవరి 21న సోమవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తామన్నారు. అక్కడినుంచి భజన మండళ్ల సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటామని తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.