JEO INSPECTS FOOD COURTS AND QUEUE LINES_ తిరుమ‌ల‌లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కేంద్రాలు, సర్వదర్శనం క్యూలైన్లను తణిఖీ చేసిన తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు

Tirumala, 29 Sep. 18 : As Tirumala has been witnessing heavy pilgrim crowd following Second Peratasi Saturday, JEO Sri KS Sreenivasa Raju inspected the queue lines and other arrangements to pilgrims.

He inspected the food court located at Anjanadri Nagar Cottage area and even tasted the Sambar rice that is being served to pilgrims. Later he also inspected the ANC Sub enquiry office and verified the registers.

In Narayanagiri queue lines inspection, Temple DyEO Sri Harindranath, AVSO Sri Gangaraju, Anna prasadam special officer Sri Venugopal were also present along with JEO.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కేంద్రాలు, సర్వదర్శనం క్యూలైన్లను తణిఖీ చేసిన తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు

సెప్టెంబరు 29, తిరుమల 2018: తమిళులకు ముఖ్యమైన పెరటాశి నెల 2వ శ‌నివారం సందర్భంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, సేవలందించాలని టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు అధికారులను ఆదేశించారు. శ‌నివారం రాత్రి జెఈవో, అధికారులతో కలిసి తిరుమలలోని అన్న‌ప్ర‌సాద కేంద్ర‌ల‌ను, నారాయణగిరి ఉద్యాణవనంలోని సర్వదర్శనం క్యూలైన్ల‌ను తణిఖీ చేశారు.

ఇందులోభాగంగా అంజ‌నాద్రి న‌గ‌ర్ కాటేజిల వ‌ద్ద గ‌ల అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కేంద్ర‌ల వ‌ద్ద పంపిణీ చేస్తున్న సాంబ‌రుఅన్నంను భ‌క్తుల‌తో క‌లిసి స్వీక‌రించారు. ఏ.ఎన్‌.సి విచార‌ణ కేంద్రంలో గ‌దుల‌కు సంబంధించిన రిజిష్ర్ట‌ర్ల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం నారాయణగిరి ఉద్యాణవనంలోని సర్వదర్శనం క్యూలైన్ల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, ఎవిఎస్వో శ్రీ గంగరాజు ఇతర అదికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.