PITTSBURGH TEMPLE GEARS UP TO HOST AGAMA SADAS_ అమెరికాలోని శ్రీ‌వారి ఆల‌యాల్లో ఆగ‌మ‌శాస్త్రబ‌ద్ధంగా కైంక‌ర్యాలు నిర్వ‌హించాలి – టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌

Tirupati, 29 September 2018: Sri Venkateswara Swamy temple in Pittsburgh in United States of America is gearing up to host the first ever Agama Sadaa on Sunday.

In connection with this prestigious religious convention, a review meeting was organised by Tirupati JEO Sri Pola Bhaskar in the temple premises with the temple organising committee members over the arrangements.

Smt G Gouthami, DyEO Sri Srinivasacharyulu, Sri SubbaReddy and Sri Vijay Reddy temple administrators, Sri Venkatachari, Chief Priest, SV Temple, Pittsburgh were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అమెరికాలోని శ్రీ‌వారి ఆల‌యాల్లో ఆగ‌మ‌శాస్త్రబ‌ద్ధంగా కైంక‌ర్యాలు నిర్వ‌హించాలి – టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌

పిట్స్‌బ‌ర్గ్‌లో ఆగ‌మ‌శాస్త్ర స‌ద‌స్సు ప్రారంభం

తిరుపతి, 2018 సెప్టెంబరు 29: అమెరికాలోని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల్లో ఆగ‌మ‌శాస్త్రబ‌ద్ధంగా కైంక‌ర్యాలు నిర్వ‌హించాలని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్ కోరారు. అమెరికాలోని పిట్స్‌బ‌ర్గ్‌లో గ‌ల‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో రెండు రోజుల ఆగ‌మ‌శాస్త్ర స‌ద‌స్సు శ‌నివారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది.

ఈ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పోల భాస్క‌ర్ మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి గౌ.. శ్రీ చంద్రబాబునాయుడు సూచ‌న‌ల మేర‌కు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల‌ను అనుస‌రించి ఈ స‌ద‌స్సును ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ రెండు రోజుల స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య నిర్వాహ‌కులు ముందుకు రావ‌డం సంతోష‌క‌ర‌మ‌ని చెప్పారు. మ‌న పూర్వీకులు ఏర్పాటుచేసిన ఆగ‌మ‌శాస్త్రానుసారం తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో పూజ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. టిటిడి ఆల‌యాల్లో జ‌రుగుతున్న ఆగ‌మ‌శాస్త్ర ప‌ద్ధ‌తుల‌నే ఇత‌ర ఆల‌యాలు అనుస‌రిస్తున్నాయ‌ని వివ‌రించారు. ఇలాంటి ఆగ‌మ‌శాస్త్ర పూజల‌ను అమెరికాలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల్లోనూ అనుస‌రిస్తే బాగుంటుంద‌ని భ‌క్తులు చేసిన సూచ‌న‌ల మేర‌కు ఈ స‌ద‌స్సు ఏర్పాటుచేశామ‌న్నారు. ఈ స‌ద‌స్సులో ప్ర‌స్తుత పూజా విధానాల‌ను అధ్య‌యనం చేసి మ‌రింత మెరుగైన ప‌ద్ధ‌తిలో కైంక‌ర్యాలు నిర్వ‌హించేందుకు టిటిడి ఆగ‌మపండితులు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నార‌ని తెలిపారు.

కాగా, ఆదివారం ఇక్క‌డి ఆల‌యంలో టిటిడి ఆధ్వ‌ర్యంలో శ్రీ‌నివాస క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

ఈ స‌ద‌స్సులో టిటిడి డెప్యూటీ ఇఓ శ్రీమతి గౌతమి, ఆగ‌మ పండితులు శ్రీ శ్రీనివాసాచార్యులు, శ్రీ పురుషోత్తమాచార్యులు, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య నిర్వాహ‌కులు శ్రీ సుబ్బారెడ్డి, శ్రీ విజయ్ రెడ్డి, శ్రీ సుబ్బారావు చెన్నూరి, శ్రీ వేంక‌టాచారి, అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో గ‌ల ప‌లు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల అర్చ‌కులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.