JEO INSPECTS SGS ARTS COLLEGE_ టిటిడి విద్యాసంస్థలలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
Tirupati, 14 Mar. 19: Tirupati JEO Sri B Lakshmikantham on Thursday inspected SGS Arts College in Tirupati.
The JEO monitored the class rooms, hostels rooms and other facilities being provided to students.
Later he interacted with the students about their academics as well on their hostel facilities.
DEO Sri Ramachandra, SGS Arts College Principal Sri Ramesh and others were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టిటిడి విద్యాసంస్థలలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
తిరుపతి, 14 మార్చి 2019: ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థలలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాలను జెఈవో గురువారం ఉదయం పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు చదువుతో పాటు నైపుణాభివృద్ధి పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్‌జిఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు తాగునీటి వసతి, గ్రంథాలయం పనివేళలు, తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ భవనాన్ని తణిఖీ చేసి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై పలు సూచనలు చేశారు.
ఈ తనిఖీల్లో టిటిడి డిఈవో శ్రీ రామచంద్ర, ఎస్‌జిఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.