TTD REST HOUSE GETS ISO CERTIFICATION_ విష్ణునివాసం వ‌స‌తి స‌ముదాయానికి ఐఎస్‌వో ధ్రువీక‌ర‌ణ‌

VISHNUNIVASAM SETS EXAMPLE IN QUALITY MANAGEMENT

Tirupati, 14 Mar. 19: In recognition to its qualitative services, the TTD Rest House, Vishnu Nivasam located in the heart of the temple city of Tirupati, won the certificate of International Organization for Standardization (ISO).

This certificate was presented to TTD EO Sri Anil Kumar Singhal by ISO Director Sri Karthikeyan in the former’s chamber in TTD Administrative Building in Tirupati on Thursday. The ISO Director appreciated the efforts put up by TTD in providing qualitative services maintaining all standard parameters in spite of the visit by multitude of pilgrims from across the country.

Later Tirupati JEO Sri B Lakshmikantham, during a brief session with a few senior officers of TTD in Conference Hall in TTD Administrative Building in Tirupati said, ISO was formed on February 23 in 1947 and operates in over 160 countries. It has 20000 standards and 10 non-negotiable indicators. This ISO certificate to Vishnu Nivasam Rest House is first of its kind in TTD. This should be an inspiration to all the other departments and especially the hospitals and educational institutions to provide quality services to patients and pupils respectively, he maintained.

Adding further, the JEO said, the ISO team paved three visits to Vishnu Nivasam in the last 20 days. During their first visit they have offered their inputs, directions and the non-negotiable parameters, while in their second visit they did mid-term evaluation and finally they made a surprise visit to check whether we are following all the standard parameters or not.

“I whole-heartedly congratulate all the departments who made this happen in Vishnu Nivasam and setting an example to others in improving their standards. Next three hospitals including BIRRD, Central Hospital and Ayurvedic Hospital and three educational institutions with two Junior Colleges and Balamandir should gear up for this prestigious recognition”, the JEO directed the concerned officials.

Later the ISO Director Sri B Karthikeyan also lauded the services of TTD employees in maintaining the quality of living in Vishnu Nivasam. “The initiative by JEO Sri B Lakshmikantham is extraordinary and the team work by TTD employees is outstanding. There is always scope for more improvement in your respective areas”, he maintained.

MD of ISO Sri N Balasakthi Velu, CE of TTD Sri Chandra Sekhar Reddy, FACAO Sri O Balaji, SE 1 Sri Ramesh Reddy, CMO Dr Nageswara Rao, DEO Sri Ramachandra, other officers and principals of various TTD colleges were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

విష్ణునివాసం వ‌స‌తి స‌ముదాయానికి ఐఎస్‌వో ధ్రువీక‌ర‌ణ‌

టిటిడి ఈవో, జెఈవో స‌మ‌క్షంలో ధ్రువ‌ప‌త్రం అందించిన ఐఎస్‌వో ప్ర‌తినిధులు

తిరుపతి, 2019 మార్చి 14: టిటిడికి చెందిన తిరుప‌తిలోని విష్ణునివాసం వ‌స‌తి స‌ముదాయానికి ఐఎస్‌వో (ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌ ఆర్గ‌నైజేష‌న్‌) ధ్రువీక‌ర‌ణ ల‌భించింది. ఈ మేర‌కు ఐఎస్‌వో సంస్థ ప్ర‌తినిధులు గురువారం టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం స‌మ‌క్షంలో ధ్రువ‌ప‌త్రం అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఐఎస్‌వో డైరెక్ట‌ర్ శ్రీ కార్తికేయ‌న్ మాట్లాడుతూ విష్ణునివాసం వ‌స‌తి స‌ముదాయానికి భ‌క్తులు విశేష‌సంఖ్య‌లో విచ్చేస్తున్నార‌ని, ఈ భ‌వ‌నం నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి టిటిడి మెరుగైన నాణ్య‌త ప్ర‌మాణాలు పాటిస్తోంద‌ని అభినందించారు.

అనంత‌రం స‌మావేశ మందిరంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ 1947, ఫిబ్ర‌వ‌రి 23న ఐఎస్‌వో ఏర్పాటైంద‌ని, 160 దేశాలు స‌భ్య‌త్వాన్ని పొందాయ‌ని, ఇప్ప‌టివ‌ర‌కు 20 వేల స్టాండ‌ర్డ్స్‌ను గుర్తించారని వివ‌రించారు. టిటిడిలో మొట్ట‌మొద‌టిసారిగా విష్ణునివాసానికి ఐఎస్‌వో ధ్రువీక‌ర‌ణ ల‌భించింద‌న్నారు. ఇదే స్ఫూర్తితో టిటిడి ఆసుప‌త్రులు, విద్యాసంస్థ‌లు మెరుగైన సేవ‌లు అందించి ఐఎస్‌వో ధ్రువీక‌ర‌ణ కోసం కృషి చేయాల‌ని కోరారు. ఐఎస్‌వో ప్ర‌తినిధులు 20 రోజుల్లో మూడుసార్లు విష్ణునివాసాన్ని ప‌రిశీలించార‌ని తెలిపారు. మొద‌టిసారి ప‌రిశీల‌న‌లో ప‌లు సూచ‌న‌లు ఇచ్చార‌ని, రెండోసారి ఒక అంచ‌నాకు వ‌చ్చార‌ని, మూడోసారి ప‌రిశీల‌న‌లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించ‌డం ద్వారా నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించార‌ని తెలియ‌జేశారు. ఇలాంటి గుర్తింపు కోసం కృషి చేసిన అన్ని విభాగాల అధికారుల‌కు ఈ సంద‌ర్భంగా జెఈవో అభినందించారు. విష్ణునివాసంలో సిబ్బంది అంద‌రూ డ్రెస్‌కోడ్‌, గుర్తింపు కార్డు ధ‌రించేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, భ‌క్తుల‌కు నిస్వార్థంగా సేవ‌లందించేలా సిబ్బంది చేత ప్ర‌తిజ్ఞ చేయించామ‌న్నారు. అదేవిధంగా, అన్న‌ప్ర‌సాదాలు నాణ్యంగా త‌యారుచేసి భ‌క్తుల‌కు అందించామ‌ని, ర‌క్షిత‌ తాగునీటి వ‌స‌తి క‌ల్పించామ‌ని, గ‌దులు, లాక‌ర్లు సుల‌భంగా ల‌భ్య‌మ‌య్యేలా ఏర్పాట్లు చేశామ‌ని, భ‌క్తులకు అర్థ‌మ‌య్యేలా సూచిక‌బోర్డులు ఏర్పాటుచేశామ‌ని వివ‌రించారు. గ‌దుల్లో విద్యుత్‌, నీటి స‌ర‌ఫ‌రా, మ‌రుగుదొడ్లు చ‌క్క‌గా ఉండేలా చేశామ‌ని, అక్క‌డ‌క్క‌డా టివిలు ఏర్పాటుచేసి ఎస్వీబీసీ ద్వారా భ‌క్తుల్లో ఆధ్యాత్మికత పెంపొందించే కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేశామ‌ని తెలియ‌జేశారు. భ‌ద్ర‌తాప‌రంగా స‌మ‌స్య‌లు ఎదురైన‌పుడు వెంట‌నే స్పందించి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుకోనేందుకు వీలుగా మాక్‌డ్రిల్ నిర్వ‌హ‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఐఎస్‌వో ఎండి శ్రీ ఎన్‌.బాల‌శ‌క్తివేలు, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ ఎన్‌.శ్రీ‌కృష్ణ, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, ఎస్ఇ-1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, సిఎంఓ డా..నాగేశ్వ‌ర‌రావు, విద్యాశాఖాధికారి శ్రీ రామ‌చంద్ర‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.