JEO INSPECTS VISHNU NIVASAM_ భక్తుల సంతృప్తే పరమావధి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం విష్ణునివాసంలో జెఈవో తనిఖీలు

Tirupati, 18 Feb. 19: TTD JEO Sri B Lakshmikantham, on Monday inspected Vishnu nivasam rest house in Tirupati.

As a part of his inspection he covered Srivari seva department, slotted sarva darshanam counters, locker and room allotment counters etc.

He interacted with the pilgrims who are residing in the rooms and dormitories and enquired about the amenities being provided to them by TTD like annaprasadam, slotted sarva darshanam tokens etc.

Later speaking to media persons he said, the pilgrims expressed immense satisfaction over the maintenance of accommodation in Vishnunivasam complex.

To avoid repetition of darshanam by same pilgrim with various tokens advanced biometric system will be introduced in the counters.

SE I Sri Ramesh Reddy, DyEO Smt Lakshmi Narasamma, EE Sri Venkata krishna Reddy, DE Sri Ravishankar Reddy, Special Officer Sri Munirathnam Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తుల సంతృప్తే పరమావధి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం విష్ణునివాసంలో జెఈవో తనిఖీలు

ఫిబ్రవరి 18, తిరుపతి, 2019: టిటిడి యాత్రికుల సముదాయాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి భక్తుల సంతృప్తే పరమావధిగా ముందుకెళుతున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని విష్ణునివాసం వసతి సముదాయంలో గదులు, గదుల కేటాయింపు కౌంటర్లు, టైంస్లాట్‌ టోకెన్‌ కౌంటర్లు, శ్రీవారి సేవ విభాగంతోపాటు అన్నప్రసాద వితరణను పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ విష్ణునివాసంలో ఉన్న సౌకర్యాలు, గదుల లభ్యతను పరిశీలించేందుకు తనిఖీలు చేపట్టామన్నారు. గదుల్లో దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండుకవర్లు ఎప్పటికప్పుడు మార్చాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. కొందరు భక్తులు రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం స్లాట్‌తోపాటు సర్వదర్శనం స్లాట్‌ను కూడా బుక్‌ చేసుకుంటున్నారని, ఇలా చేయడం వల్ల ఎక్కువ మంది భక్తులకు అవకాశం రావడం లేదని చెప్పారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా ఇలా జరగకుండా చూస్తామన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు అర్థమయ్యేలా పలు భాషల్లో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటుచేయాలని, టైంస్లాట్‌ టోకెన్‌ కౌంటర్లు పెంచాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. విష్ణునివాసంలో ఖాళీ స్థలాన్ని భక్తులకు ఉపయోగకరంగా మారుస్తామన్నారు.

తిరుమలకు వచ్చే భక్తులకు సంపూర్ణంగా యాత్ర అనుభవం కలిగేలా ప్యాకేజి టూర్‌ను రూపొందించాలని పర్యాటక శాఖ అధికారులను కోరతామని జెఈవో తెలిపారు. తిరుమలలో ముందుగా శ్రీ వరాహస్వామివారిని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవాలని, వరుసగా తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని, తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారిని, శ్రీగోవిందరాజస్వామివారిని, అదేవిధంగా స్థానికాలయైన శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంట, నారాయణవనం, నాగలాపురం ఆలయాలను దర్శించుకోవాలని కోరారు.

జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, విష్ణునివాసం డెప్యూటీ ఈవో శ్రీమతిలక్ష్మీనరసమ్మ, ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.మునిరత్నంరెడ్డి, ఇఇ శ్రీవెంకటకృష్ణారెడ్డి, డిఇ శ్రీ రవిశంకర్‌రెడ్డి, ఏఈవో శ్రీమతి గీత, ఎవిఎస్‌వో శ్రీ రాజేష్‌ తదితరులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.