JEO INSPECTS VONTIMITTA _ ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వ‌ర‌కు ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు-బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లను ప‌రిశీలించిన జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

Tirupati, 9 Mar. 22: In connection with the annual Brahmotsavams which is commencing in Sri Kodanda Ramalayam at Vontimitta in YSR Kadapa district from April 10 onwards, the TTD JEO Sri Veerabrahmam along with CVSO Sri Gopinath Jatti inspected the temple on Wednesday.

As the State festival of Sri Sita Rama Kalyanam is scheduled on the evening between 8pm and 10pm on April 15, the JEO directed the officials concerned on the arrangements to be made for the mega celestial fete.

Later speaking to the media he said the team of officers inspected the site and the development works to be done apart from taking any additional works.

He said water and food arrangements, shades, shelters, works at Kalyana Vedika, sanitation, hassle free darshan were also discussed.

CVSO said, TTD along with local administration and police will ensure all safety measures for the sake of devotees who will be visiting for darshan as well for Kalyanotsavam. He said due to Covid last two years, the annual fete was observed in Ekantam. Keeping in view the past experiences we are making all arrangements for barricading, security to the devotees.

CE Sri D Nageswara Rao, SE Electrical Sri Venkateswarulu, VGO Sri Manohar, Additional Health Officer Dr Sunil, EE Smt Sumati, DE Electrical Sri Chandrasekhar, DyEOs Sri Ramana Prasad, Sri Lakshman Naik and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వ‌ర‌కు ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లను ప‌రిశీలించిన జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

తిరుప‌తి, 2022 మార్చి 09: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామాల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు, స్థ‌ల ప‌రిశీల‌న, క‌ల్యాణవేదిక వ‌ద్ద జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి పనుల‌ను జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం బుధ‌వారం ప‌రిశీలించారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లపై ఇంజినీరింగ్‌, ఆల‌య అధికారుల‌తో చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వ‌ర‌కు ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు సీతారాముల క‌ల్యాణం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. ఏప్రిల్ 19న‌ పుష్ప‌యాగం జ‌రుగ‌తుంద‌న్నారు. ఇందుకోసం చేప‌ట్ట‌వ‌ల‌సిన ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ ప‌నులు స‌కాలంలో పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా వేలాదిగా వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, షెడ్లు, తాగునీరు, అన్న‌ప్ర‌సాదాల‌పై పంపిణీపై అధికారుల‌తో చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. క‌ల్యాణ వేదిక వ‌ద్ద జ‌రుగుతున్న అభివృద్ధి ప‌న‌లును త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

అనంత‌రం సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ స్వామివారి క‌ల్యాణానికి వేలాదిగా వ‌చ్చే భ‌క్తుల‌కు భ‌ద్ర‌తా ప‌రంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్‌, పోలీస్ విభాగం వారితో స‌మ‌న్వ‌యం చేసుకొని ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ద‌ర్శ‌నం, అన్న‌ప్ర‌సాదాల పంపిణీ వ‌ద్ద తోపులాట లేకుండా బ్యారీకేడ్లు, క‌ల్యాణానికి వ‌చ్చే భ‌క్తుల‌కు పార్కింగ్ ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.

అంత‌కుముందు జెఈవో, సివిఎస్వోతో క‌లిసి శ్రీ కోదండ‌రామాల‌యం, ఆల‌య ప‌రిస‌రాలు, క‌ల్యాణ వేదిక ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

జెఈవో వెంట టిటిడి సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, అద‌న‌పు ఆరోగ్య విభాగం అధికారి డా.సునీల్‌, ఇఇ శ్రీ‌మ‌తి సుమ‌తి, డిఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, డెప్యూటి ఈవో డా. ఆర్‌.ర‌మ‌ణ్ర‌ప‌సాద్‌, శ్రీ ల‌క్ష్మ‌ణ్ నాయ‌క్‌, ఇత‌ర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.