JEO RELEASES POSTERS _ తొండమనాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

Tirupati, 4 February 2020: JEO Sri P Basanth Kumar released the posters of annual brahmotsavams Sridevi Bhudevi Sametha Sri Venkateswara Samy of Tondamandu on Tuesday.

He also released the Mahasivarathri festival posters of Sri Seshachala Lingeswara Swamy near Chandragiri. 

Temple DyEO Sri Subramanyam, Temple Suptd Sri Bhupathi, Sri Krishna Rao were also present in the event which took place at JEO chamber in Tirupati. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

తొండమనాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

తిరుపతి, 2020 ఫిబ్రవరి 04: టిటిడి అనుబంధ ఆలయాలు అయిన తొండమనాడులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు, చంద్రగిరి మండలం శేషాపురం గ్రామంలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ మంగ‌ళ‌వారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

తొండమనాడులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం..

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆలయంలో ఫిబ్రవరి 18వ తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, ఫిబ్రవరి 22న అంకురార్పణ జ‌రుగ‌నున్నాయ‌ని తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 23న ఉద‌యం 8.00 గంట‌ల‌కు ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు. ఇందులో భాగంగా ప్ర‌తి రోజు ఉద‌యం స్వామి, అమ్మ‌వార్ల‌కు అభిషేకం, రాత్రి 7.00 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయ‌న్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                          ఉదయం               సాయంత్రం

23-02-2020(ఆదివారం)        ధ్వజారోహణం        శేష వాహనం

24-02-2020(సోమ‌వారం)            ——-                 హంస వాహనం

25-02-2020(మంగ‌ళ‌వారం)        ——–                సింహ వాహనం

26-02-2020(బుధ‌వారం)             ——-                  హ‌నుమంత‌వాహ‌నం  

27-02-2020(గురువారం)             ——–                క‌ళ్యాణోత్స‌వం, గ‌రుడ‌వాహ‌నం

28-02-2020(శుక్ర‌వారం)              ——-                   గజ వాహనం

29-02-2020(శ‌నివారం)                ——-                   చంద్రప్రభ వాహనం

01-03-2020(ఆదివారం)        తిరుచ్చి ఉత్స‌వం      అశ్వ‌వాహనం

02-03-2020(సోమ‌వారం)        చ‌క్ర‌స్నానం                ధ్వజావరోహణం.

కాగా ఫిబ్ర‌వ‌రి 27వ తేదీ ఆలయంలో కల్యాణోత్సవం సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు వైభవంగా జరుగనుంది. రూ.500- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. మార్చి 3వ తేదీ ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఘనంగా జరుగనుంది.

శేషాపురం శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయం…

చంద్రగిరి సమీపంలోని శేషాపురం శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 20 నుండి 22వ తేదీ వ‌ర‌కు మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 21న స్వామివారికి అభిషేకాలు, ఫిబ్ర‌వ‌రి 22న శివపార్వతుల కల్యాణం, స్వామి, అమ్మ‌వార్లు నంది వాహనంపై ఊరేగనున్నట్లు తెలిపారు.  

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత,  ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామ‌ని తెలిపారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవార్ల‌ కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జెఈవో కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ కృష్ణారావు, శ్రీ భూప‌తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.