JEO REVIEWS ON WOMEN’S DAY ARRANGEMENTS _ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

Tirupati, 20 Feb. 21: The JEO for Health and Education Smt Sada Bhargavi reviewed on the arrangements for the ensuing International Women’s Day on Saturday.

Reviewing in TTD Administrative Building with Deputy EO Welfare Sri Anandaraju and other women officers, she directed them that every women employee should enthusiastically participate in the event that is going to take place in Mahati Auditorium on March 8.

She also instructed the Welfare Officer to conduct Essay Writing, Elocution, devotional or patriotic songs both vocal and instrument, Painting competitions to women employees for the occasion.

She also instructed that the committees constituted to supervise activities of Catering, cultural, invitation, organising etc. Should discharge their duties with efficacy and make the programme a grand success.

Spl Gr DyEO Smt Varalakshmi, DyEOs Smt Shanti, Smt Snehalatha, SV Music and Dance College Principal Dr Jamunarani, Medical Superintendent Dr Kusuma and others women officers, employees were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మహిళా దినోత్సవం ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

తిరుప‌తి, 2021 ఫిబ్ర‌‌వ‌రి 20: టిటిడి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై జెఈఓ(ఆరోగ్యం మ‌రియు విద్య‌) శ్రీమ‌తి స‌దా భార్గ‌వి శ‌నివారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు ఉపయోగపడేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో నిష్ణాతులైన మహిళలను ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించాలన్నారు. మహిళా ఉద్యోగులకు దేశభక్తి, భక్తి పాటలు, వ్యాసరచన, చిత్రలేఖ‌నం పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయాలన్నారు. అనంతరం కార్యనిర్వాహక‌, వక్తల ఎంపిక, జ్ఞాపికల కొనుగోలు, సాంస్కృతిక కమిటీలను ఏర్పాటు చేశారు. స్థాయితో సంబంధం లేకుండా మ‌హిళా ఉద్యోగులంద‌రూ పాల్గొనేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

ఈ సమావేశంలో టిటిడి ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌లక్ష్మి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి స్నేహలత, శ్రీమతి శాంతి, శ్రీ ఆనంద‌రాజు, ఎస్వీ సంగీత క‌ళాశాల ప్రిన్సిపాల్ శ్రీ‌మ‌తి జ‌మునారాణి, మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ కుసుమ‌, ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రి వైద్యురాలు డాక్ట‌ర్ రేణు దీక్షిత్‌, సంక్షేమ విభాగం సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి శ్రీ‌వాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.