JYESTABHISHEKAM CONCLUDES IN SRI GT_ కవచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకం
Tirupati, 14 Jul. 19:The annual Jyestabhishekam also known as Adhyayanotsavams concluded on a grand religious note in Sri Govindaraja Swamy temple at Tirupati on Sunday.
Ealier during the day Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Govinda Raja Swamy, Sri Devi and Bhu Devi.
Later Kavacha Samarpana was performed to deities. In the evening the deities were taken on a celestial procession along mada streets.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
కవచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకం
జూలై 14, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం ఘనంగా ముగిసింది.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు కవచాలను ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని కల్యాణమండపంలోకి వేంచేపు చేసి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామృతం వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. కవచ ప్రతిష్ట, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం నిర్వహించిన తరువాత స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు.
సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఇవో శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ జ్ఞానప్రకాష్, శ్రీ శ్రీహరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ ప్రశాంత్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.