JYESTABHISHEKAM A RITUAL OF PRESERVATION OF SRIVARI UTSAVAM IDOLS_ జూన్ 14 నుండి 16వ తేదీ వరకు వజ్ర, ముత్యం, స్వర్ణ కవచాలతో అలంకరణ
Tirumala, 12 Jun. 19: TTD is grandly conducting Jyestabhisekam, a devotional sacred ritual aimed at preserving the utsava bronze idols of Sr Malayappaswamy, consorts Sridevi and Sri Bhudevi from corrosion due to a large number of abhisekam and rituals throughout the year.
The three-day event is performed at the Kalyana Mandapam within the Sampangi prakaram Of Srivari temple as per Agama traditions on jyesta nakshatram in Jyeshta Masam from June 14-16.
On the first day, the utsava idols are adorned with diamond kavacham after homam, abhisekam and snapana thirumanjanam and paraded on the mada streets.
On day 2 the utsava idols are draped in pearl kavacham and onDay three they are cloaked in gold kavacham. The gold kavacham is removed from the utsava idols only during the next Jyestabhisekam.
In view of the sacred event TTD has canceled the arjita sevas in Srivari temple: Nijapada darshan and Vasantotsavam on June 14, Vasantotsavam on June 15, and Kalyanotsavam, unjal seva,arjita Brahmotsavams and Vasantotsavam on last day June 16. The statutory rituals of Tomala and Archana Seva are performed in ekantham.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జ్యేష్ట మాసం.. జ్యేష్టా నక్షత్రం.. జ్యేష్ఠాభిషేకం
జూన్ 14 నుండి 16వ తేదీ వరకు వజ్ర, ముత్యం, స్వర్ణ కవచాలతో అలంకరణ
తిరుమల, 2019 జూన్ 12: కొన్నేళ్లుగా అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కల్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని ‘అభిధేయక అభిషేకం’ అని కూడా అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 14 నుండి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది.
మొదటిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహించిన తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు.
రెండో రోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు కవచంతోనే ఉంటారు.
జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 14న నిజపాద దర్శనం, వసంతోత్సవం, జూన్ 15న వసంతోత్సవం, చివరిరోజైన జూన్ 16న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. కాగా తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.