ANKURARPANAM OF APPALAYAGUNTA SRI PVST BTU_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Appalayagunta, 12 Jun. 19: The holy ritual of Ankurarpanam Of annual Brahmotsavams Of Sri Prasanna Venkateswara temple, Appalayagunta was grandly conducted on Wednesday evening.

The rituals of medini puja and Viwaksena Utsavam were conducted on mada streets ahead of Ankurarpanam in the yagashala of the temple.

TTD JEO Sri B Lakshmi Kantham, DyEO Jhansi Rani, AEO Sri Subramanyam, Superintendent Sri Gopalakrishna Reddy, Temple Inspector Sri Srinivasulu other officials and archakas participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుప‌తి, 2019 జూన్ 12: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు బుధ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ముందుగా మేదినిపూజ చేప‌ట్టారు. ఆ త‌రువాత సేనాధిపతి ఉత్సవం నిర్వ‌హించారు. ఈ ఉత్స‌వం ద్వారా శ్రీ విష్వ‌క్సేనుల‌వారు నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని ప్ర‌తీతి. ఆ త‌రువాత యాగ‌శాల‌లో అంకురార్పణం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, ఆర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.