JYESTABHISHEKAM IN SRI TT FROM JUNE 22-24 _ జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్టాభిషేకం
Tirumala, 13 Jun. 21: The annual Jyestabhishekam will be observed in Tirumala temple from June 22 till June 24.
This festival is also known as Abhidyeyaka Abishekam and is performed to Utsava deities every year in the month of Jyesta concluding on Jyesta star.
On the first day Sri Malayappa Swamy will be decked in Vajra Kavacha, second day in Mutyapu Kavacha and on the final day in Swarna Kavacha.
It is in this golden armour the deity graces the devotees all through the year.
TTD has cancelled virtual arjitha sevas including Kalyanotsavam, arjita Brahmotsavam and Unjal seva on the last day in connection with this festival.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్టాభిషేకం
తిరుమల, 2021 జూన్ 13: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజులపాటు జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.
సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.
మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహించిన తర్వాత శ్రీ మలయప్పస్వామివారికి వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు.
రెండో రోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు.
ఆర్జితసేవలు రద్దు :
జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో చివరిరోజైన జూన్ 24న వర్చువల్ ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంలను టిటిడి రద్దు చేసింది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.