KALYANA RATHAM DONATED TO TTD _ తి.తి.దే కు కల్యాణ రథం కానుక
TIRUMALA, SEPT 12: A new Kalyana Ratham has been donated to TTD on Thursday evening in front of the temple which will be used for Srinivasa Kalyanams.
Tiruchy based donor Sri Murali handed over the special vehicle to TTD Chairman Sri K Bapiraju and JEO Tirumala Sri KS Sreenivasa Raju. Meanwhile Ashok Leyland has spent Rs.15lakhs on the body chaser while the donor contributed Rs.30lakhs towards the additional fabrication for the vehicle.Transport GM of TTD Sri Sesha Reddy, Tirumala DI Sri Naidu were also present.
తి.తి.దే కు కల్యాణ రథం కానుక
తిరుమల, 12 సెప్టెంబరు 2013 : తి.తి.దే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వివిధ ప్రదేశాల్లో నిర్వహించే శ్రీనివాసకల్యాణల తాలూకు కల్యాణ రథానికి సంబంధించిన నూతన వాహనాన్ని తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ఒక భక్తుడు గురువారం సాయంత్రం ఆలయం ముందు కానుకగా సమర్పించనున్నారు.
దాదాపు 45 లక్షల విలువజేసే ప్రత్యేక కల్యాణరథాన్ని తమిళనాడులోని తిరుచ్చికి చెందిన దాత శ్రీమురళి తి.తి.దే చైర్మెన్ శ్రీ కనుమూరు బాపిరాజు, తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజులకు అందజేయనున్నారు. కాగా ఈ వాహనానికి సంబంధించిన బాహ్య ఆకారానికి అశోక్‌లేలాండ్‌వారు రూ.15 లక్షలు, తిరుచ్చికి చెందిన దాత శ్రీమురళి ఇతర హంగులకు గాను రూ. 30 లక్షలు విరాళంగా అందించారు. ఈ కల్యాణరథాన్ని శ్రీనివాస కల్యాణ సమయంలో ఉత్సవమూర్తుల తరలింపునకు మరియు ధర్మప్రచారానికి ఉపయోగించనున్నారు.
ఈ కార్యక్రమంలో రవాణాశాఖ జి.యం. శ్రీ శేషారెడ్డి తదితరులు పాల్గొంటారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.