TTD CHAIRMAN GIVES AWAY HOUSE SITE PATTAS TO TALLAPAKA DESCENDANTS _ అన్నమయ్య వంశీకులకు ఇళ్ళపట్టాలు అందించిన తి.తి.దే ఛైర్మెన్‌

TIRUMALA, Sep 13:  TTD Chairman Sri K Bapiraju has distributed the pattas of the pucca house sites to 11 descendants of Tallapaka Annamacharya dynasty in his camp office at Tirumala on Friday evening.
 
Addressing media persons he said, “the TTD in its board resolution no.18, dated 15-5-2013 resolved to allot the houses to 11 legal heirs of Sriman Tallapaka Annamacharyula varu on free of cost and sent the proposal to government for approval. After getting the sanction from government, the house sites have been allotted to 11 eligible heirs of Tallapaka dynasty in Survey No.1 at Mangalam in Tirupati”, he added. 
 
Later he said, the foundation stone will be laid for Rs.70cr(estimated) massive building complex meant for Srivari Sevaks and the vast vehicle parking area by hon’ble CM of AP Sri N Kiran Kumar Reddy during Brahmotsavams. TTD Estate Officer Sri Devender Reddy was also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

అన్నమయ్య వంశీకులకు ఇళ్ళపట్టాలు అందించిన తి.తి.దే ఛైర్మెన్‌

తిరుమల, 13  సెప్టెంబరు : తిరుమల శ్రీవారి వైభవానిపై 32 వేలకు పైగా కీర్తనలు రచించిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య వంశీకులకు  రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఇళ్ళస్థలాలకు సంబంధించిన పట్టాలను శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు 11మంది కుటుంబీకులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళ్ళపాక వంశీకులకు 11 పక్కా గృహాలను తిరుపతిలోని మంగళం చెంత వున్న సర్వే నెంబరు.1లో కేటాయించడానికి బోర్డు ముందుకు ప్రతిపాదనలు పంపడమైనదన్నారు. ఈ మేరకు 15-5-2013 జరిగిన సమావేశంలో వారికి ఉచితంగా ఇళ్ళు కేటాయించాలని కోరుతూ ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడమైనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం మేరకు 11 పక్కా గృహాలకు సంబంధించిన పట్టాలను తాళ్ళపాక కుటుంబ సభ్యులకు అందిచడమైనదని తెలిపారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న బ్రహ్మోత్సవాలకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా రూపాయలు 70 కోట్లతో శ్రీవారి సేవకులకు ప్రత్యేక వసతి భవనానికి, పార్కింగ్‌ స్థలానికి శంఖుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో తి.తి.దే ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీ దేవేందర్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.