నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవానికి అంకురార్పణ

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవానికి అంకురార్పణ

తిరుపతి, 2018 సెప్టెంబరు 23: టిటిడికి అనుబంధ ఆలయమైన నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య ఋత్విక్‌వరణం, సాయంత్రం మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

సెప్టెంబరు 24న పవిత్రోత్సవం జరుగనుంది. ఇందులోభాగంగా ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, ఆ తరువాత పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం, యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి చేపడతారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Attachments area