POURNAMI GARUDA SEVA ON SEP 25_ సెప్టెంబరు 25న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

Tirumala, 23 September 2018: The monthly pournami Garuda Seva will be observed on September 25.

Sri Malayappa Swamy will take celestial ride on Garuda Vahanam between 7pm and 9pm on that day in the four mada streets.

NALAYIRA DIVYA PRABANDHA PARAYANAM

Nalayira Divya Prabandha Parayanam will be rendered in front of Garuda Seva with 230 expert pundits from different states.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సెప్టెంబరు 25న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2018 సెప్టెంబరు 23: తిరుమలలో సెప్టెంబరు 25వ తేదీ మంగళవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

శ్రీవారి 3వ నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం

తిరుమల, 2018 సెప్టెంబరు 23: శ్రీవారి భక్తితత్వాన్ని వ్యాప్తి చేసిన ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు సెప్టెంబరు 25న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ సందర్భంగా నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవాన్ని మూడోసారి టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఇదివరకు వేద మహోత్సవం, భజనమేళా లాంటి కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించిన విషయం విదితమే.

దివ్యప్రబంధ మహోత్సవంలో భాగంగా ద్రావిడ వేద నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 230 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల నుండి పారాయణదారులు విచ్చేయనున్నారు.

ముందుగా ఉదయం 10 గంటలకు తిరుమలలోని ఆస్థానమండపంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారులతో సమావేశం నిర్వహిస్తారు. టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి విచ్చేసి తమ సందేశాలిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు నాదనీరాజనం వేదికపై దివ్యప్రబంధ గోష్ఠిగానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగనున్న శ్రీవారి పౌర్ణమి గరుడసేవలో పండితులు దివ్యప్రబంధ పారాయణం చేస్తారు. టిటిడి నాళాయిర దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| వి.జి.చొక్కలింగం ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.