SPECIAL PUJA TO VENUGOPALA SWAMY IN KT ON AUGUST 23 _ ఆగస్టు 23న కపిలితీర్ధంలో  గోకులాష్టమి వేడుకలు

Tirupati, 18 Aug. 19: In connection with Gokulastami on August 23, special puja will be performed to Sri Rukmini Satyabhama Sametha Sri Venugopala Swamy temple located in Kapilatheertham at Tirupati.

In the night Veedhi Utsavam and Gokulastami Asthanam will be observed.

GANAPATHI PUJA ON SEPTEMBER 2

In view of Ganesha Chaviti on September 2, Ganapathi Puja will be observed in Sri Kapileswara Swamy temple in Tirupati.

Special abhishekam will be performed to the presiding deity while in the evening there will be procession of the Utsavarulu of Sri Ganapathi Swamy in the mada streets on Mooshika Vahanam between 6pm and 9pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 23న కపిలితీర్ధంలో  గోకులాష్టమి వేడుకలు

తిరుపతి, 2019 ఆగస్టు 18: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 23వ తేదీ గోకులాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. 

ఇందులో భాగంగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, రాత్రి 8.00 నుండి 8.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 2వ తేదీ శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి 

శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 2వ తేదీ వినాయక చవితి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 

ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.