POSTERS RELATED TO VONTIMITTA FETE RELEASED_ ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
Tirupati, 18 Aug. 19: The wall posters pertaining to annual pavitrotsavams at Sri Kodandaramalayam at Vontimitta were released by Tirupati JEO Sri P Basant Kumar in his chambers in TTD Administrative building on Sunday.
The three day fete will be performed from August 31 till September 2 with Ankurarpanam on August 30.
Temple DyEO Sri C Govindarajan was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
తిరుపతి, 2019 ఆగస్టు 18: టిటిడి అనుబంధ ఆలయమైన కడప జిల్లా ఒంటిమిట్టలో గల శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 30 నుండి సెప్టెంబరు 2వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ ఆవిష్కరించారు. తిరుపతిలోని జెఈవో నివాస కార్యాలయంలో బంగ్లాలో ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆగస్టు 30వ తేదీ విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణం, రక్షాబంధనం, మ త్సంగ్రహణం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 31న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు చతుష్టానార్చాన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం 6.00 గంటలకు పవిత్రహోమాలు నిర్వహిస్తారన్నారు. సెప్టెంబరు 1న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు బాలభోగం, పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. సెప్టెంబరు 2న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగుస్తాయన్నారు. సాయంత్రం 5.00 గంటల నుండి స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగిన పలు క్రతువుల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజులు, ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.