KARNATAKA CM & EX CM OFFER PRAYERS AT SRIVARI TEMPLE _ శ్రీవారి సేవలో కర్ణాటక సిఎం, మాజీ సిఎం

Tirumala,19, August: Karnataka Chief Minister Sri Basavaraj Bommai and Former CM Sri BS Yediyurappa on Friday offered prayers at Srivari Temple and sought the blessings of Sri Venkateshwara.

 

They were received with traditional honours at the Temple Mahadwaram by the TTD chairman Sri YV Subba Reddy and AP deputy CM Sri Narayana Swami.

 

After Srivari Darshan they were offered Veda ashirvachanam at Ranganayakula Mandapam. The TTD chairman presented Srivari thirtha Prasadam. TTD EO Sri AV Dharma Reddy, CVSO Sri Narasimha Kishore and Temple DyEO Sri Ramesh Babu were present.

 

INSPECTS KARNATAKA CHOULTRY BHAVAN

 

Thereafter the Karnataka CM and his predecessor inspected the development works at the Karnataka Choultry Bhavan.

 

Speaking on the occasion the TTD chairman Sri YV Subba Reddy said after completing the Kalyana Mandapam and first block works, TTD will hand over the building to the Karnataka government by January 2023. The Karnataka government has contributed ₹200 crores for the works.

 

TTD board members Sri Vishwanath Reddy, Karnataka Endowment commissioner Kumari Rohini Sindhuri, TTD Chief Engineer Sri Nageswara Rao, EE Sri Jaganmohan Reddy were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి సేవలో కర్ణాటక సిఎం ,మాజీ సిఎం

తిరుమల 19 ఆగస్టు 2022: కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై , మాజీ ముఖ్యమంత్రి శ్రీ యద్యూరప్ప శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి వీరికి స్వాగతం పలికారు . స్వామివారి దర్శనం అనంతరం . రంగనాయకుల మండపం లో పండితులు వేద ఆశీర్వచనం చేశారు . అనంతరం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి. సిఎం , మాజీ సిఎం లకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు . టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి , సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్ ,ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు పాల్గొన్నారు .

కర్ణాటక సత్రాల నిర్మాణ. పనుల పరిశీలన

శ్రీవారి దర్శనం అనంతరం తిరుమలలో టీటీడీ నిర్మిస్తున్న కర్ణాటక సత్రాల భవనాల నిర్మాణం పనులను కర్ణాటక ముఖ్యమంత్రి ,మాజీ ముఖ్యమంత్రి పరిశీలించారు . ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ , కళ్యాణమండపం , మొదటి బ్లాక్ నిర్మాణాలను జనవరి ఆఖరుకు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలిపారు . ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం టీటీడీ కి రూ 200 కోట్లు చెల్లించిందన్నారు .
టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ విశ్వనాథ రెడ్డి , కర్ణాటక దేవదాయ శాఖ కమిషనర్ కుమారి రోహిణి సింధూరి , టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు , ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి , ఈ ఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది