KARTHIKA DEEPOTSAVAM IN TIRUMALA ON DECEMBER 15 _ డిసెంబర్ 15న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం

TIRUMALA, 13 DECEMBER 2024:The holy hills of Tirumala will observe the Karthika Deepotsavam in the temple on December 15. 
 
As a part of this fete, the hill shrine shines under the illumination of mud lamps on Sunday evening.A galaxy of over 100 mud lamps will be lit in different places starting from Garbha Griha. 
 
The lamps will be lit in front of Akhandam of Sanctum Sanctorum, Kulasekhara Padi, Ramulavari Meda, Garudalwar, Dwarapalakas, Vakulamata Shrine, Varadaraja Swamy Shrine, Yoga Narasimha, Viswaksenulavari Sannidhi, Sabha Ara, Chandana Ara, Kshetrapalakula Sanniddhi, Bangaru Vakili, Vendi Vakili, Dhwaja stambham, Balipeetham, Kshetrapalakula Sannidhi, Tirumalaraya Mandapam, Poolabaavi, Tirumala Rayamandapam, Ranganayakula Mandapam, Mahadwaram. 
 
While outside the temple at Sri Varahaswamy Temple, Bedi Anjaneya Swamy temple and Swamy Pushkarini. TTD has cancelled Sahasra Deepalankara Seva and monthly Pournami Garuda Seva in view of this festival.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబర్ 15న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం

తిరుమల, 2024 డిసెంబరు 13: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 15 తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణ‌మినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా సాయంత్రం నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.

ఈ కారణంగా 15వ తేది సహస్రదీపాలంకరణ సేవను, పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.