DHWAJASTHAMBHA PRATISTHAPANA IN KARVETINAGARAM_ జూలై 1న కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ

Tirupati, 30 June 2018: The erection of new Dhwajasthambham in Sri Venugopala Swamy temple at Karvetinagaram will be observed on July 1.

In connection with this, special rituals like Dhwajasthambha Adhivasa Trayam, Maha Shanti Tirumanjanam performed to utsavarulu on Saturday.

Meanwhile, the Dhwajasthambha Pratisthapana will be observed between 9am and 11am in the auspicious Simha Lagnam.

The annual brahmotsavams in this famous shrine will be observed from July 2 to 10. Ankurarpana for the annual fete will be observed on Sunday evening between 5.30pm and 8.30pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 1న కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ

తిరుపతి, 2018 జూన్‌ 30: కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో జూలై 1వ తేదీన ఆదివారం నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం నూతన ధ్వజస్థంభ అధివాస త్రయం, స్వామి, అమ్మవార్లకు మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు.

జూలై 1న ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ

జూలై 1వ తేదీ ఆదివారం ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు సింహలగ్నంలో నూతన ధ్వజస్తంభమును శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించనున్నారు.

జూలై 1వ తేదీ సాయంత్రం అంకురార్పణం

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం వైభవంగా అంకురార్పణ జరుగనుంది.

సాయంత్రం 5.30 నుండి 8.30 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

02-07-2018(సోమవారం) ధ్వజారోహణం(మిధున లగ్నం) పెద్దశేష వాహనం

03-07-2018(మంగళవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

04-07-2018(బుధవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

05-07-2018(గురువారం) కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

06-07-2018(శుక్రవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

07-07-2018(శనివారం) హనుమంత వాహనం గజ వాహనం

08-07-2018(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

09-07-2018(సోమవారం) రథోత్సవం అశ్వవాహనం

10-07-2018(మంగళవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూలై 5వ తేదీ సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 11వ తేదీన మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.