KARVETINAGARAM FLOAT FESTIVAL _ ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు
TIRUMALA, 11 AUGUST 2024: The annual float festival in Sri Venugopala Swamy temple at Karvetinagaram will be observed from August 17 to 19.
On first day Sri Kodanda Rama Swamy, second and last days as Sri Venugopala Swamy, the utsava murthies will bless devotees on the finely decked float between 4pm to 6pm everyday.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి, 2024 ఆగస్టు 11: కార్వేటినగరంలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా మొదటి రోజు ఆగస్టు 17న శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ఆగస్టు 18, 19వ తేదీల్లో శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు సాయంత్రం 6 నుంచి 7.30 గంలకు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల